Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి, నాగార్జున లతో సినిమా చేయాలని ఉంది " లారెన్స్

రాఘవ లారెన్స్ మన అందరికి సుపరిచుతుడైన డాన్స్ మాస్టర్. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని యువత ని ఉర్రూతలూగించేలా కొత్త కొత్త స్టెప్స్ వేయించిన ప్రతిభ కలవాడు. మెల్ల మెల్లగా యాక్టర్ గా ఆ పైన దర్శకుడి గా మారిన లారెన్స్ ముని సిరీస్ తో మంచి సక్సెస్ ని సాధించాడు. కాంచన 3 తో మరి కొద్ది రోజుల్లో మన ముందుకు రానున్న లారెన్స్ ఈ రోజు హైదరాబాద్ లో సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసాడు. […]

చిరంజీవి, నాగార్జున లతో సినిమా చేయాలని ఉంది  లారెన్స్
X

రాఘవ లారెన్స్ మన అందరికి సుపరిచుతుడైన డాన్స్ మాస్టర్. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని యువత ని ఉర్రూతలూగించేలా కొత్త కొత్త స్టెప్స్ వేయించిన ప్రతిభ కలవాడు. మెల్ల మెల్లగా యాక్టర్ గా ఆ పైన దర్శకుడి గా మారిన లారెన్స్ ముని సిరీస్ తో మంచి సక్సెస్ ని సాధించాడు. కాంచన 3 తో మరి కొద్ది రోజుల్లో మన ముందుకు రానున్న లారెన్స్ ఈ రోజు హైదరాబాద్ లో సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసాడు.

అక్కడే మీడియా తో మాట్లాడుతూ తన మనసులోని కోరిక ని బయట పెట్టాడు. ఒకప్పుడు చిరంజీవి పాట అంటే లారెన్స్ స్టెప్పులు కంపోస్ చేయాల్సిందే. అలాంటి రేంజ్ ఉండేది లారెన్స్ కి. అందుకే ఖైదీ నం.150 లో కూడా ప్రత్యేకంగా లారెన్స్ తో ఒక పాట చేయించుకున్నారు చిరంజీవి. ఆ మెగా స్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయాలి అనే కోరిక ని లారెన్స్ ఈ రోజు బయట పెట్టాడు.

మీడియా వాళ్ళతో ముచ్చటిస్తూ “నేను హీరోగా, డైరెక్టర్ గా సినిమాలు చేస్తూనే, నన్ను పెద్ద డాన్స్ మాస్టర్ని చేసిన మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక సినిమా, నన్ను ‘మాస్’ తో డైరెక్టర్ ని చేసిన కింగ్ నాగార్జున గారితో ఒక సినిమా డైరెక్ట్ చేయాలనేది నా కోరిక” అని లారెన్స్ అన్నాడు.

First Published:  28 March 2019 4:44 AM GMT
Next Story