Telugu Global
Cinema & Entertainment

జనాలని భయపెట్టబోతున్న ఈషా రెబ్బా

తెలుగు హీరోయిన్లు ఎంత మంచి ప్రతిభ కనబరిచినా కానీ మన దర్శక నిర్మాతలు ఎక్కువ శాతం బయట వారికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువు అయినా తెలుగు అమ్మాయిలు మాత్రం నిరుత్సాహ పడకుండా అవకాశాలని ఒడిసి పట్టుకుంటున్నారు. కలర్ స్వాతి, అంజలి తర్వాత ఆ స్థాయి లో మెప్పించిన ఈ తరం తెలుగు అమ్మాయిల్లో ఈషా రెబ్బ ముందుంది. అయితే అడపా దడపా పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు, చిన్న […]

జనాలని భయపెట్టబోతున్న ఈషా రెబ్బా
X

తెలుగు హీరోయిన్లు ఎంత మంచి ప్రతిభ కనబరిచినా కానీ మన దర్శక నిర్మాతలు ఎక్కువ శాతం బయట వారికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువు అయినా తెలుగు అమ్మాయిలు మాత్రం నిరుత్సాహ పడకుండా అవకాశాలని ఒడిసి పట్టుకుంటున్నారు.

కలర్ స్వాతి, అంజలి తర్వాత ఆ స్థాయి లో మెప్పించిన ఈ తరం తెలుగు అమ్మాయిల్లో ఈషా రెబ్బ ముందుంది. అయితే అడపా దడపా పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు, చిన్న సినిమాల్లో హీరోయిన్ పాత్రలు చేసిన ఈషా ఈ సారి తన పంథా మార్చింది.

స్వాతి ‘త్రిపుర’ తో హారర్ సినిమాలని, అంజలి ‘గీతాంజలి’ తో హారర్ సినిమాలని చేయడం మొదలు పెట్టారో, ఇప్పుడు ఈషా కూడా ఆ దిశగా అడుగు లు వేస్తూ ఒక హారర్ చిత్రాన్ని అంగీకరించింది. డమరుకం చిత్రాన్ని తీసిన శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం లో ఒక కొత్త చిత్రాన్ని ఈషా ఒప్పుకుంది.

ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం ఈషా ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషిస్తుందట. సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూ నే తిరుగుతుందని వినికిడి. ఈ తెలుగు అమ్మాయి ఎంత వరకు ఆడియన్స్ ని భయపెట్టగలదో వేచి చూడాల్సిందే.

First Published:  28 March 2019 6:06 AM GMT
Next Story