Telugu Global
NEWS

పార్టీ అధికారంలోకి రాదని బాబు కన్నా వాళ్ళదే బాధ

“తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఇది ఒక చారిత్రక అవసరం” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల సభలో పదే పదే చెబుతున్నమాట. తాను అధికారంలోకి రాకపోతే బ్రహ్మాండం బ్రద్దలై పోతుంది అన్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు, ఆయనకు వంతపాడే పచ్చ మీడియా ప్రచారాన్ని ఊదరకొడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే చారిత్రిక అవసరం ప్రజల కంటే పచ్చ మీడియా అధిపతులకు ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. […]

పార్టీ అధికారంలోకి రాదని బాబు కన్నా వాళ్ళదే బాధ
X

“తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. ఇది ఒక చారిత్రక అవసరం” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల సభలో పదే పదే చెబుతున్నమాట. తాను అధికారంలోకి రాకపోతే బ్రహ్మాండం బ్రద్దలై పోతుంది అన్నట్లుగా నారా చంద్రబాబు నాయుడు, ఆయనకు వంతపాడే పచ్చ మీడియా ప్రచారాన్ని ఊదరకొడుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే చారిత్రిక అవసరం ప్రజల కంటే పచ్చ మీడియా అధిపతులకు ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు పచ్చ మీడియా అధిపతులు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే ఆ మీడియా అధిపతులకు…. వారి సామాజిక వర్గానికి ఎంతో అవసరమని వారు అంటున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయని పచ్చ మీడియా నిర్వహించిన రహస్య సర్వేలో వెల్లడవుతోందన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపే ఆయన సామాజిక వర్గానికి చెందిన మీడియాకు భయం ఎక్కువయిందని ఆ వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారైందని ఆ పార్టీతో పాటు వారి మీడియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది అంటున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు, మైనారిటీలు, మహిళలు, ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లుగా సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి అని చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ యువతలో 15 శాతం మంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైపు ఆకర్షితులవుతున్నారని సర్వేలో తేలిందని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఆ పార్టీ ప్రజాప్రతినిధులు చేసిన అవినీతి ఒకటైతే… అభివృద్ధి పేరుతో మోసం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ పరిణామాలను అంచనా వేసుకున్న ఎల్లో మీడియా అధిపతులు ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఏం చేయాలా అని మధన పడుతున్నట్లు సమాచారం.

Next Story