Telugu Global
Cinema & Entertainment

16 ఇయర్స్ ఇండస్ట్రీ.. అయితే ఏంటి?

ఇవాళ్టితో ఇండస్ట్రీకొచ్చి 16 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు బన్నీ. సరిగ్గా 16 ఏళ్ల కిందట, ఇదే రోజు బన్నీ హీరోగా నటించిన తొలి సినిమా గంగోత్రి విడుదలైంది. దీంతో 16 ఇయర్స్ బన్నీ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అందుకుంది. నిజానికి ఈ రోజు కోసం 2 రోజుల నుంచి బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్. ఈ సందర్భంగా కొత్త సినిమా వివరాలు చెప్పమంటూ హారిక-హాసిని నిర్మాతలకు అభిమానులు విజ్ఞప్తులు కూడా చేశారు. కానీ మేకర్స్ మాత్రం లైట్ తీసుకున్నారు. […]

16 ఇయర్స్ ఇండస్ట్రీ.. అయితే ఏంటి?
X

ఇవాళ్టితో ఇండస్ట్రీకొచ్చి 16 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు బన్నీ. సరిగ్గా 16 ఏళ్ల కిందట, ఇదే రోజు బన్నీ హీరోగా నటించిన తొలి సినిమా గంగోత్రి విడుదలైంది. దీంతో 16 ఇయర్స్ బన్నీ అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అందుకుంది. నిజానికి ఈ రోజు కోసం 2 రోజుల నుంచి బన్నీ ఫ్యాన్స్ వెయిటింగ్. ఈ సందర్భంగా కొత్త సినిమా వివరాలు చెప్పమంటూ హారిక-హాసిని నిర్మాతలకు అభిమానులు విజ్ఞప్తులు కూడా చేశారు. కానీ మేకర్స్ మాత్రం లైట్ తీసుకున్నారు.

బన్నీకి శుభాకాంక్షలు చెప్పిన నిర్మాతలు… అతడు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమాకు సంబంధించి ఒక్కటంటే ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వలేదు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లో ఉందని, అవన్నీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే వివరాలు చెబుతామంటూ తప్పించుకున్నారు. అలా ఈ స్పెషల్ డే ఎటూ కాకుండా పోయింది.

కాస్త తరచి చూస్తే.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కంట్రోల్స్ అన్నీ తన వద్ద పెట్టుకున్నట్టున్నాడు త్రివిక్రమ్. ఇప్పటికే హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్ ఎంపికలో బన్నీ మాటను ఖాతరు చేయలేదు యూనిట్. ఇప్పుడు ఈ స్పెషల్ డేను కూడా పట్టించుకోలేదు. వాస్తవానికి ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఏంటనేది ఇప్పటికే ఫిక్స్ అయింది. కనీసం ఈరోజు ఆ టైటిల్ ను విడుదల చేసినా బాగుండేది. ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అది కుదరని పక్షంలో మూవీ ఎప్పట్నుంచి సెట్స్ పైకి వస్తుందనే విషయాన్ని చెప్పినా సరిపోయేది. కనీసం ఆ మేటర్ కూడా బయటపెట్టలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నిరాశ చెందారు.

First Published:  28 March 2019 6:18 AM GMT
Next Story