Telugu Global
Cinema & Entertainment

చిన్న సినిమాకు పెద్ద మొత్తంలో శాటిలైట్

విశ్వామిత్ర.. సస్పెన్స్-థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఓ చిన్న సినిమా. నందితా రాజ్, సత్యంరాజేష్ లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమా, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగుతుంది. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రీ-రిలీజ్ బిజినెస్ కంటే ముందే విశ్వామిత్ర శాటిలైట్ డీల్ పూర్తయింది. విశ్వామిత్ర సినిమాను ప్రత్యేకంగా చూసిన ఓ ప్రముఖ ఛానెల్, భారీ మొత్తానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజా సమాచారం […]

చిన్న సినిమాకు పెద్ద మొత్తంలో శాటిలైట్
X

విశ్వామిత్ర.. సస్పెన్స్-థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఓ చిన్న సినిమా. నందితా రాజ్, సత్యంరాజేష్ లీడ్ రోల్స్ పోషించిన ఈ సినిమా, అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగుతుంది. ఈ వేసవిలోనే సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రీ-రిలీజ్ బిజినెస్ కంటే ముందే విశ్వామిత్ర శాటిలైట్ డీల్ పూర్తయింది.

విశ్వామిత్ర సినిమాను ప్రత్యేకంగా చూసిన ఓ ప్రముఖ ఛానెల్, భారీ మొత్తానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం, జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. కోటి, కోటిన్నర మధ్యలో ఈ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే, విశ్వామిత్ర సినిమా జాక్ పాట్ కొట్టినట్టే.

గతంలో గీతాంజలి, త్రిపుర లాంటి సినిమాల్ని తీసిన రాజకిరణ్ దర్శకత్వంలో తెరకెక్కింది విశ్వామిత్ర. న్యూజీలాండ్‌, అమెరికాలో నిజంగా జరిగిన ఘటనలపై పరిశోధన చేసి ఈ కథ రాసుకున్నానంటున్నాడు రాజకిరణ్. ఏప్రిల్ లో సినిమాను విడుదల చేస్తామని ప్రకటించాడు.

First Published:  27 March 2019 7:15 AM GMT
Next Story