Telugu Global
NEWS

టికెట్ ఇవ్వలేదని కుర్చీలు ఎత్తుకెళ్లిన కాంగ్రెస్ నాయకుడు

ఎన్నికల వేళ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఘర్షణలు పడటం…. ఒకరిపై ఒకరు విమర్శల దాడులు చేసుకోవడం సాధారణమే. అలాగే టికెట్ దక్కని అభ్యర్థులు పలు రకాలుగా నిరసన వ్యక్తం చేస్తారు. అవసరమైతే పార్టీ మారి టికెట్ సంపాదిస్తారు.. అది కూడా కుదరకపోతే రెబెల్ అభ్యర్థిగా బరిలో దిగుతారు. కాని మహారాష్ట్రకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు చేసిన పని అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది. మహారాష్ట్రలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్ధల్ సత్తార్ ఔరంగాబాద్ నుంచి లోక్‌సభ […]

టికెట్ ఇవ్వలేదని కుర్చీలు ఎత్తుకెళ్లిన కాంగ్రెస్ నాయకుడు
X

ఎన్నికల వేళ చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఘర్షణలు పడటం…. ఒకరిపై ఒకరు విమర్శల దాడులు చేసుకోవడం సాధారణమే. అలాగే టికెట్ దక్కని అభ్యర్థులు పలు రకాలుగా నిరసన వ్యక్తం చేస్తారు. అవసరమైతే పార్టీ మారి టికెట్ సంపాదిస్తారు.. అది కూడా కుదరకపోతే రెబెల్ అభ్యర్థిగా బరిలో దిగుతారు. కాని మహారాష్ట్రకు చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు చేసిన పని అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతోంది.

మహారాష్ట్రలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే అబ్ధల్ సత్తార్ ఔరంగాబాద్ నుంచి లోక్‌సభ టికెట్ ఆశించాడు. తనకు టికెట్ వస్తుందనే ధీమాతో అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాడు. కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న ఎస్పీతో ఒక కార్యక్రమం ఉంటే అందుకు అవసరమైన కుర్చీలు తెప్పించి రెడీగా ఉంచాడు. చివరకు తనకు టికెట్ రాలేదు. వేరే నాయకుడు సుభాష్‌కు టికెట్ ఇచ్చారు. దీంతో సత్తార్‌కు కోపం నషాళానికి ఎక్కింది.

తనకు టికెట్ ఇవ్వనందుకు నిరసనగా పార్టీ కార్యాలయానికి వెళ్లి సమావేశానికి ఏర్పాటు చేసిన కుర్చీలు తీసుకొని వెళ్లిపోయాడు. నేను ఏర్పాటు చేసిన కుర్చీల్లో మీరు కూర్చోని మీటింగ్‌లు పెట్టుకోవడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే కాక కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశాడు. దాదాపు 300 కుర్చీలను పార్టీ కార్యాలయం నుంచి తీసుకొని వెళ్లిపోవడంతో…. పార్టీ వాళ్ళు వేరే చోట సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దీనిపై స్పందించిన పార్టీ నాయకులు.. ఆయన విరాళం ఇచ్చిన కుర్చీలు ఆయనే తీసుకొని వెళ్లారు, మేమెలా ఆ కుర్చీలు కావాలని అడుగుతామని సమాధానం ఇచ్చారు.

First Published:  27 March 2019 12:18 AM GMT
Next Story