Telugu Global
Cinema & Entertainment

డియర్ కామ్రేడ్ కూడా వాయిదా పడుతోందా?

ముందుగా ఓ డేట్ ప్రకటించేయడం, తర్వాత తీరిగ్గా వాయిదా వేయడం టాలీవుడ్ లో చాలా కామన్. రీసెంట్ గా ఇది మరింత ఎక్కువైంది. మహర్షి సినిమాను ఇప్పటికి 2 సార్లు వాయిదావేశారు. సీత సినిమా కూడా వాయిదాపడింది. అర్జున్ సురవరం కూడా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడీ లిస్ట్ లోకి డియర్ కామ్రేడ్ కూడా చేరింది. అవును.. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. లెక్కప్రకారం ఈ సినిమా మే 31న థియేటర్లలోకి […]

డియర్ కామ్రేడ్ కూడా వాయిదా పడుతోందా?
X

ముందుగా ఓ డేట్ ప్రకటించేయడం, తర్వాత తీరిగ్గా వాయిదా వేయడం టాలీవుడ్ లో చాలా కామన్. రీసెంట్ గా ఇది మరింత ఎక్కువైంది. మహర్షి సినిమాను ఇప్పటికి 2 సార్లు వాయిదావేశారు. సీత సినిమా కూడా వాయిదాపడింది. అర్జున్ సురవరం కూడా వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడీ లిస్ట్ లోకి డియర్ కామ్రేడ్ కూడా చేరింది.

అవును.. విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. లెక్కప్రకారం ఈ సినిమా మే 31న థియేటర్లలోకి రావాలి. కానీ అదే రోజు సూర్య నటిస్తున్న ఎన్జీకే సినిమా రిలీజ్ పెట్టుకున్నారు. సూర్యకు తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ భాషల్లో అభిమానులున్నారు. పైగా డియర్ కామ్రేడ్ సినిమాను తమిళ్ లో కూడా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి సూర్య సినిమాలో క్లాష్ ఉండకూడదనే ఉద్దేశంతో మే 31 నుంచి సినిమాను తప్పించారు.

తాజా సమాచారం ప్రకారం, జూన్ మొదటి వారంలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉండడంతో.. ప్రస్తుతానికి ఈ విషయాన్ని మేకర్స్ బయటపెట్టడం లేదు. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తారు. విజయ్ దేవరకొండ, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజైంది. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

First Published:  27 March 2019 8:04 AM GMT
Next Story