Telugu Global
Cinema & Entertainment

విజయ్ దేవరకొండ తో పోటీపడనున్న సూర్య

మొన్నటిదాకా సినిమాలు లేక వెలవెలబోయిన థియేటర్లు మళ్లీ సినిమాలతో ప్రేక్షకుల తో కళకళలాడనున్నాయి. ఏప్రిల్ నుంచి కనీసం వారానికి ఒక సినిమా అయినా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మే లో కూడా సినిమాల హంగామా బాగానే కనిపిస్తుంది. అయితే మే 31న రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదలకానున్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం కాగా రెండవది సూర్య నటించిన ‘ఎన్జీకే’. ‘టాక్సీ వాలా’ సినిమాతో హిట్ అందుకున్న టాలీవుడ్ […]

విజయ్ దేవరకొండ తో పోటీపడనున్న సూర్య
X

మొన్నటిదాకా సినిమాలు లేక వెలవెలబోయిన థియేటర్లు మళ్లీ సినిమాలతో ప్రేక్షకుల తో కళకళలాడనున్నాయి. ఏప్రిల్ నుంచి కనీసం వారానికి ఒక సినిమా అయినా విడుదల కాబోతోంది.

ఈ నేపథ్యంలో మే లో కూడా సినిమాల హంగామా బాగానే కనిపిస్తుంది. అయితే మే 31న రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విడుదలకానున్నాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం కాగా రెండవది సూర్య నటించిన ‘ఎన్జీకే’.

‘టాక్సీ వాలా’ సినిమాతో హిట్ అందుకున్న టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. మే 31న విడుదలవనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరొకవైపు సూర్య హీరోగా గా సాయి పల్లవి, రకుల్ ప్రీత్ హీరోయిన్లుగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎన్జీకే’ సినిమా కూడా ఇదే రోజున విడుదల కానుంది. ఇంతకు ముందు సూర్య నటించిన ‘గ్యాంగ్’ సినిమా గత ఏడాది సంక్రాంతి బరిలో బోలెడు స్టార్ హీరో సినిమాలతో పోటీపడి పర్వాలేదనిపించుకుంది.

ఈసారి కూడా మంచి అంచనాల మధ్య విడుదల అవుతున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం తో పోటీపడనున్నది. మరి ఈ రెండిటిలో ఏది విజేతగా నిలుస్తుందో చూడాలి.

First Published:  25 March 2019 10:54 PM GMT
Next Story