Telugu Global
Health & Life Style

క్షయ.... భయపడొద్దయ్యా....

నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం.. క్షయ. గాలి ద్వారా సంక్రమించే వ్యాధి. టీబీ అని కూడా పిలిచే ఈ వ్యాధి ఒకప్పుడు మహమ్మారిలా ప్రపంచ ప్రజలను వేధించేది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెఐవి ఉన్న వారికి క్షయ తొందరగా ఎటాక్ అవుతుందని వారు అంటున్నారు.  2012 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా టీబీ వ్యాధి కారణంగా 1.3 మిలియన్ల మంది […]

క్షయ.... భయపడొద్దయ్యా....
X
  • నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం..

క్షయ. గాలి ద్వారా సంక్రమించే వ్యాధి. టీబీ అని కూడా పిలిచే ఈ వ్యాధి ఒకప్పుడు మహమ్మారిలా ప్రపంచ ప్రజలను వేధించేది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికే ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. హెఐవి ఉన్న వారికి క్షయ తొందరగా ఎటాక్ అవుతుందని వారు అంటున్నారు. 2012 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా టీబీ వ్యాధి కారణంగా 1.3 మిలియన్ల మంది మరణించినట్లుగా అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఈ వ్యాధి ఎలా వస్తుందో ముందుగా చూద్దాం

  • గాలి ద్వారా సంక్రమించే క్షయ అంటు వ్యాధి.
  • వాతావరణం లోని హానికర గాలులు, క్రిములు, కాలుష్యం ఊపిరితిత్తులలోకి చొరబడడం ద్వారా క్షయ వ్యాధి వస్తుంది.
  • టీబీ వ్యాధిగ్రస్తులు తుమ్మినా, దగ్గినా… ఆ పక్కన ఉన్న వారికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.
  • ప్రపంచ వ్యాప్తంగా 2.3 బిలియన్ల మంది క్షయతో బాధపడుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
  • ఈ వ్యాధి లక్షణాలు అంత తీవ్రంగా ఉండవు. దీంతో క్షయ పట్ల రోగులు, వారి బంధువులు కూడా అశ్రద్ధ చూపిస్తారని వైద్యులు అంటున్నారు.
  • శరీరంలో క్షయ బ్యాక్టీరియా చురుకుగా ఉన్నా… రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నా క్షయ తొందరగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాలలోనే క్షయ వ్యాధి ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
  • టీబీ తొలుత ఊపిరితిత్తులో చేరి ఆ తర్వాత మూత్ర పిండాలు, చివరకు మెదడుకు చేరుతుంది.

క్షయ వ్యాధి… లక్షణాలు….

  • ఈ వ్యాధి సోకిన వారిని ఎడతెగని దగ్గు వేధిస్తుంది. అలాగే కాలంతో సంబంధం లేకుండా చెమటలు పోస్తాయి. విపరీతమైన నీరసం ఆవహిస్తుంది. రాత్రి వేళల్లో తరచుగా జ్వరం వస్తున్నా క్షయ వ్యాధి సోకినట్లుగా అనుమానించాలి.
  • వాతావరణం చల్లగా ఉన్నప్పటికి కూడా విపరీతంగా చెమటలు పడితే అది క్షయ వ్యాధికి ప్రధాన లక్షణంగా గుర్తించాలి.
  • ఊపీరి పీల్చే సమయంలో పిల్లికూతలు, ఈల వేస్తున్నట్టుగా శబ్దాలు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.

క్షయ వ్యాధి సోకిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తాలు…

  • క్షయ వ్యాధి వచ్చిందని నిర్ధారణ కాగానే ధూమపానం, పొగాకు, మద్యం, కాఫీ, టీ తాగడం వంటివి మానివేయాలి.
  • ఆహార పదార్ధాల్లో నూనె వాడకం తగ్గించాలి. కొలెస్ట్ర్రాల్, మాంసాహారం తీసుకోవడం కూడా వెంటనే నిలిపివేయాలి.

క్షయ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన ఆహారం

  • ఆకు కూరలు ఎక్కువగా తినాలి. బచ్చలి కూర ఈ వ్యాధిని నివారించడంలో ఎంతో మేలు చేస్తుంది.
  • క్యారెట్, చెర్రీస్, తాజా కూరగాయలు, పండ్లు, బీన్స్, బ్రోకాలి వంటివి ఎక్కువగా తీసుకోవాలి.
  • టమాటాలు, బ్లూబెర్రీస్, చెర్రీస్, పాలకూరతో పాటు గోధుమలతో చేసిన ఆహార పదార్ధాలు ఎక్కువగా తినాలి.

ఈ జాగ్రత్తలతో పాటు డాక్టర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే క్షయ భయపడే వ్యాధి కాదు.గతంతో పొలిస్తే క్షయ వ్యాధి పట్ల అంత భయం అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. గతంలో క్షయ నివారణకు ఇన్ని సదుపాయాలు, మందులు కూడా అందుబాటులో ఉండేవి కావు. ఆధునిక కాలంలో మాత్రం టీబీని నియంత్రించేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. అయితే ఈ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే ఎంతో మేలు.

First Published:  23 March 2019 8:19 PM GMT
Next Story