Telugu Global
NEWS

నారా కుటుంబానికి మీకు వకాల్తా పుచ్చుకున్నారు " మంచు మనోజ్ ఫైర్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో  నటుడు మోహన్‌బాబుపై టీడీపీ నేత కుటుంబరావు చేసిన ఆరోపణలకు మోహన్‌ బాబు కుమారుడు మంచు మనోజ్ స్పందించారు. కుటుంబరావుకు సవాల్ విసిరారు. కుటుంబరావు కావాలనే  2017-18 ఫీజు బకాయిలకు సంబంధించిన వివరాలను దాస్తున్నారని మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో తాము చెప్పిన విషయంలో ఒక్క అబద్దం ఉన్నా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోబోమని సవాల్ చేశారు. విద్యానికేతన్ సంస్థలపై చేసిన ఆరోపణలను…. దమ్ముంటే నిరూపించాలన్నారు.  25 మందికి ఉచితంగా విద్యను […]

నారా కుటుంబానికి మీకు వకాల్తా పుచ్చుకున్నారు  మంచు మనోజ్ ఫైర్
X

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో నటుడు మోహన్‌బాబుపై టీడీపీ నేత కుటుంబరావు చేసిన ఆరోపణలకు మోహన్‌ బాబు కుమారుడు మంచు మనోజ్ స్పందించారు. కుటుంబరావుకు సవాల్ విసిరారు. కుటుంబరావు కావాలనే 2017-18 ఫీజు బకాయిలకు సంబంధించిన వివరాలను దాస్తున్నారని మంచు మనోజ్ ఫైర్ అయ్యారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో తాము చెప్పిన విషయంలో ఒక్క అబద్దం ఉన్నా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి తీసుకోబోమని సవాల్ చేశారు. విద్యానికేతన్ సంస్థలపై చేసిన ఆరోపణలను…. దమ్ముంటే నిరూపించాలన్నారు. 25 మందికి ఉచితంగా విద్యను అందిస్తున్న ఘనత తన తండ్రిదన్నారు. ఈ వ్యవహారంపై కుటుంబరావుతో చర్చకు తాము సిద్ధమని మనోజ్ సవాల్ చేశారు.

ఫిబ్రవరి 5న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రావత్‌కు లేఖ రాశామన్నారు. వారం రోజుల్లో డబ్బు చెల్లిస్తామని చెప్పి ఆ తర్వాత పట్టించుకోలేదన్నారు. కుటుంబరావు నారా కుటుంబానికి వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని మంచు మనోజ్ ఫైర్ అయ్యారు. తాము చెబుతున్న అంశాలు అబద్దమని నిరూపించగలరా? అని మంచు మనోజ్ సవాల్ చేశారు.

First Published:  22 March 2019 10:17 PM GMT
Next Story