Telugu Global
NEWS

అద్వానీ స్థానంలో అమిత్ షా.... రాహుల్‌ పై స్మృతి ఇరానీ

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కురువృద్దుడు లాల్ క్రిష్ణ అద్వానీకి బిజేపీ అధిష్టానం మొండి చేయి చూపించింది. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని పోటీ చేస్తున్నారు. అద్వానీ స్దానంలో గాంధీ నగర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు. ఇలా అసక్తికరమైన టిక్కెట్ల కేటాయింపులతో…. భారతీయ జనతా పార్టీ 182 మంది అభ్యర్దుల తొలి […]

అద్వానీ స్థానంలో అమిత్ షా.... రాహుల్‌ పై స్మృతి ఇరానీ
X

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, కురువృద్దుడు లాల్ క్రిష్ణ అద్వానీకి బిజేపీ అధిష్టానం మొండి చేయి చూపించింది. ఇక కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి స్మృతి ఇరాని పోటీ చేస్తున్నారు. అద్వానీ స్దానంలో గాంధీ నగర్ లోక్ సభ నియోజక వర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పోటీ చేస్తున్నారు.

ఇలా అసక్తికరమైన టిక్కెట్ల కేటాయింపులతో…. భారతీయ జనతా పార్టీ 182 మంది అభ్యర్దుల తొలి జాబితాను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా తమ అభ్యర్దులను ప్రకటించింది బిజేపీ. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరిగి మరోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ లక్నో నుంచి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నాగ్ పూర్ నుంచి, అలనాటి అందాల నటి హేమమాలిని మధుర నుంచి పోటీ చేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో కీలక నియోజక వర్గాలకు కూడా బిజేపీ అభ్యర్దులను ప్రకటించింది. విశాఖపట్నం నుంచి పురంధరేశ్వరి, నర్సరావు పేట నుంచి కన్నా లక్ష్మీ నారాయణ, నర్సాపురం నుంచి మాజీ మంత్రి మాణిక్యాలరావు పోటీ చేస్తున్నారు. మిగిలిన నియోజక వర్గాలైన ఏలూరు నుంచి రామకోటయ్య, గుంటూరు నుంచి జయప్రకాష్, అనంతపురం నుంచి చిరంజీవి రెడ్డి బిజేపీ టిక్కెట్లు పొందారు.

ఇక తెలంగాణ నుంచి రెండు రోజుల క్రితం భారతీయ జనతా పార్టీలో చేరిన డికె. అరుణకు మహబూబ్ నగర్ టిక్కెట్టు కేటాయించారు. సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు టిక్కెట్టు దక్కలేదు. ఆయన స్దానంలో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డికి బిజేపీ టిక్కెట్టు దక్కింది. నిజామాబాద్ నుంచి టిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్ కుమారుడు డి అరవింద్ కు నిజామాబాద్ టిక్కెట్టు దక్కింది.

బిజేపీ దేశవ్యాప్తంగా తొలి జాబితాలో సీనియర్లకు మాత్రమే టిక్కెట్లు ప్రకటించడం విశేషం.

First Published:  21 March 2019 8:48 PM GMT
Next Story