Telugu Global
NEWS

దేవినేని ఉమా కు సెంటిమెంట్ భ‌యం !

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాను ఇప్పుడో భ‌యం ప‌ట్టి పీడిస్తోంది. అలాంటి ఇలాంటి భ‌యం కాదు. అదో పెద్ద సెంటిమెంట్‌. ఇది గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆ మంత్రికి నిద్ర‌ప‌ట్ట‌డం లేదట. ఏం చేయాలో తోచ‌డం లేద‌ట‌. కృష్ణా రాజ‌కీయాల్లో ఈ సెంటిమెంట్‌ను ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ దాటి రాలేద‌ట‌. జిల్లాలో మంత్రిగా ప‌నిచేసిన త‌ర్వాత ఎవ‌రూ గెలవ‌లేద‌ట‌. 1983 నుంచి కృష్ణా జిల్లాలో మంత్రిగా ప‌నిచేసిన వారు మరుస‌టి ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డమ‌నేది కామ‌న్‌గా వ‌స్తోంది. ఇదో […]

దేవినేని ఉమా కు సెంటిమెంట్ భ‌యం !
X

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాను ఇప్పుడో భ‌యం ప‌ట్టి పీడిస్తోంది. అలాంటి ఇలాంటి భ‌యం కాదు. అదో పెద్ద సెంటిమెంట్‌. ఇది గుర్తుకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఆ మంత్రికి నిద్ర‌ప‌ట్ట‌డం లేదట. ఏం చేయాలో తోచ‌డం లేద‌ట‌. కృష్ణా రాజ‌కీయాల్లో ఈ సెంటిమెంట్‌ను ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ దాటి రాలేద‌ట‌. జిల్లాలో మంత్రిగా ప‌నిచేసిన త‌ర్వాత ఎవ‌రూ గెలవ‌లేద‌ట‌.

1983 నుంచి కృష్ణా జిల్లాలో మంత్రిగా ప‌నిచేసిన వారు మరుస‌టి ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డమ‌నేది కామ‌న్‌గా వ‌స్తోంది. ఇదో సెంటిమెంట్‌గా ఇప్పుడు మారింది. మైల‌వరంలో దేవినేని అనుచ‌రులు ఈ విష‌యంపైనే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. త‌మ మంత్రి ఈ సారి గెలిచేది క‌ష్ట‌మ‌ని విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు.

కృష్ణా జిల్లా నుండి 1983 నుండి నేటి వరకు జిల్లాలో మంత్రులుగా పని చేసిన వారు ఆ మరుసటి ఎన్నికలలో ఓడిపోవడం జరుగుతూనే వస్తుంది … దీనిని మైలవరం ప్రజలు నువ్వు ఓడిపోతావ్ అని గుర్తు చేస్తూ…. దేవినేని దౌర్జన్యాలని ఎండగడుతున్నారు.

కోనేరు రంగా రావు , పాలడుగు వెంకట్రావు , దేవినేని నెహ్రూ, పిన్నమనేని వేంకటేశ్వర రావు , పార్ధసారధితో పాటు ప‌లువురు మంత్రులుగా ప‌నిచేసిన నేత‌లు… ఆత‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఈ సెంటిమెంట్ ప్ర‌కారం కృష్ణా జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రులు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, కొల్లు ర‌వీంద్ర ల ఓట‌మి త‌ప్ప‌ద‌ని విశ్లేష‌ణలు వెలువ‌డుతున్నాయి.

First Published:  21 March 2019 8:33 PM GMT
Next Story