Telugu Global
Cinema & Entertainment

ఇట్స్ అఫీషియల్.... ఏలేటి దర్శకత్వంలో నితిన్

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో సినిమా. దాదాపు 6 నెలలుగా కథాచర్చలు, స్క్రీన్ ప్లే పై చర్చలు. ఇక రేపోమాపో సినిమాను అధికారికంగా ప్రకటించాలి. కానీ అందరికీ షాకిచ్చాడు నితిన్. వెంకీ కుడుముల సినిమా స్థానంలో చంద్రశేఖర్ ఏలేటికి ఛాన్స్ ఇచ్చాడు. అవును.. తను త్వరలోనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నానంటూ స్వయంగా నితిన్ ట్వీట్ చేశాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై కీరవాణి సంగీత దర్శకుడిగా ఆ సినిమా రాబోతోందని కూడా తెలిపాడు. […]

ఇట్స్ అఫీషియల్.... ఏలేటి దర్శకత్వంలో నితిన్
X

నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో సినిమా. దాదాపు 6 నెలలుగా కథాచర్చలు, స్క్రీన్ ప్లే పై చర్చలు. ఇక రేపోమాపో సినిమాను అధికారికంగా ప్రకటించాలి. కానీ అందరికీ షాకిచ్చాడు నితిన్. వెంకీ కుడుముల సినిమా స్థానంలో చంద్రశేఖర్ ఏలేటికి ఛాన్స్ ఇచ్చాడు.

అవును.. తను త్వరలోనే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నానంటూ స్వయంగా నితిన్ ట్వీట్ చేశాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై కీరవాణి సంగీత దర్శకుడిగా ఆ సినిమా రాబోతోందని కూడా తెలిపాడు. అంతేకాదు, వచ్చే నెల రెండో వారం నుంచే సెట్స్ పైకి కూడా వస్తుందని చెప్పాడు.

నితిన్ ఇంత క్లియర్ గా చెప్పడంతో, వెంకీ కుడుముల సినిమాపై అనుమానాలు పెరిగిపోయాయి. అసలు మొన్నటివరకు వెంకీతో చర్చలు జరిపి ఇప్పుడు చంద్రశేఖర్ ఏలేటి సినిమాను ప్రకటించడం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు.

అయితే అంతా అనుకుంటున్నట్టు వెంకీ సినిమా ఆగిపోలేదు. త్వరలోనే రాబోతున్న తన బర్త్ డే సందర్భంగా వెంకీ కుడుముల సినిమాను అఫీషియల్ గా ప్రకటించబోతున్నాడు నితిన్. అయితే సెట్స్ పైకి వచ్చేది మాత్రం చంద్రశేఖర్ ఏలేటి సినిమానే.

First Published:  21 March 2019 7:02 PM GMT
Next Story