Telugu Global
Cinema & Entertainment

అందుకే లిప్ లాక్ ఇవ్వాల్సి వచ్చింది అంటున్న రష్మిక

‘గీత గోవిందం’ సినిమా క్లైమాక్స్ లో విజయ్ దేవరకొండ మరియు రష్మికల మధ్య ఉన్న లిప్ లాక్ సీన్ అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ లో కూడా వారిద్దరూ ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు వీరిద్దరిపై మరియు లిప్ లాక్ సీన్ పై ఘాటుగానే స్పందిస్తున్నారు. కేవలం ఒక్క సీన్ వల్ల బోలెడంత […]

అందుకే లిప్ లాక్ ఇవ్వాల్సి వచ్చింది అంటున్న రష్మిక
X

‘గీత గోవిందం’ సినిమా క్లైమాక్స్ లో విజయ్ దేవరకొండ మరియు రష్మికల మధ్య ఉన్న లిప్ లాక్ సీన్ అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలిసి ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ లో కూడా వారిద్దరూ ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తారు.

ఈ నేపథ్యంలో నెటిజన్లు వీరిద్దరిపై మరియు లిప్ లాక్ సీన్ పై ఘాటుగానే స్పందిస్తున్నారు. కేవలం ఒక్క సీన్ వల్ల బోలెడంత క్రిటిసిజం మరియు నెగిటివిటీని అందుకుంటున్నారు విజయ్ మరియు రష్మిక.

ఇప్పటి దాకా సైలెంట్ గా ఉన్నప్పటికీ ఈ మధ్యనే ‘ఛలో’ బ్యూటీ రష్మిక దీనిపై క్లారిటీ ఇచ్చింది. కేవలం ఒక చిన్న టీజర్ చూసి తన పాత్ర గురించి ఒక నిర్ణయానికి రావడం సరికాదని, కథ డిమాండ్ చేయడం వల్లనే ఆ సీన్ చేయాల్సి వచ్చిందని చెప్పింది రష్మిక.

అంతేకాక సినిమా విడుదలైన తర్వాత సీన్ చూసి అప్పుడు మాట్లాడమని కౌంటర్ వేసింది. రష్మిక క్లారిటీ ఇవ్వాలని ప్రయత్నించినప్పటికీ నెటిజన్లు మాత్రం ఇంకా సంతృప్తి చెందలేదు.

ఒకవేళ నిజంగానే కథకు ముద్దు అవసరమై ఉండి ఉంటే అది నేరుగా వెండితెరపైనే చూపించాలి కానీ కేవలం ప్రమోషన్ల కోసం టీజర్ లో చూపించాల్సిన అవసరం ఏముంది అంటూ రివర్స్ లో ట్రోల్ చేస్తున్నారు. మరి రష్మిక అన్నట్టు కథకు ఆ సీన్ ఎంతవరకు అవసరం అనేది మే 31 న మాత్రమే మనకు తెలియనుంది.

First Published:  21 March 2019 12:15 AM GMT
Next Story