Telugu Global
Cinema & Entertainment

తన వ్యక్తిగత జీవితం గురించి షాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చిన రాయ్ లక్ష్మి

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి ఈ మధ్యనే చాలా కాలం తర్వాత హీరోయిన్ గా ‘వేర్ ఈజ్ ద వెంకట్ లక్ష్మి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హారర్ కామెడీగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాయ్ లక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన బికినీ ఫొటోలపై రియాక్ట్ అవుతూ తను ఎక్కడికి వెళ్ళినా […]

తన వ్యక్తిగత జీవితం గురించి షాక్ అయ్యేలా ఆన్సర్ ఇచ్చిన రాయ్ లక్ష్మి
X

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మి ఈ మధ్యనే చాలా కాలం తర్వాత హీరోయిన్ గా ‘వేర్ ఈజ్ ద వెంకట్ లక్ష్మి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హారర్ కామెడీగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాయ్ లక్ష్మి తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

తన బికినీ ఫొటోలపై రియాక్ట్ అవుతూ తను ఎక్కడికి వెళ్ళినా సరే సెల్ఫీలు దిగడం అలవాటని, ముంబై వెళ్ళినప్పుడు అక్కడ బికినీ కామన్ కాబట్టి అలాంటి ఫొటోలు దిగానని చెప్పిన రాయ్ లక్ష్మి ఒకవేళ తను బికినీ లో చూడటం ఇష్టం లేకపోతే కళ్ళు మూసుకోండి అంటూ కౌంటర్ ఇచ్చింది.

తన లవ్ ఎఫైర్స్ గురించి మాట్లాడుతూ…. “నా జీవితంలో జరిగిన విషయాలన్నీ దాచి పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాగని పబ్లిక్ గా కూడా చెప్పాలని లేదు. నేను చాలా మంది తో రిలేషన్ లో ఉన్న మాట నిజమే, వాటి గురించి చెప్పాలంటే టైమ్ సరిపోదు” అని షాకింగ్ జవాబు ఇచ్చింది రాయ్ లక్ష్మి.

ఇక ప్రెగ్నెన్సీ వార్తల పై రియాక్ట్ అయ్యి గట్టిగా నవ్వేసి అవి కేవలం పుకార్లు మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక తన తల్లిదండ్రులు ఓపెన్ మైండెడ్ అని భర్తని ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ రాయ్ లక్ష్మికే ఇచ్చారని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

First Published:  21 March 2019 12:04 AM GMT
Next Story