Telugu Global
Cinema & Entertainment

మహేష్ సుడిగాలి పర్యటనలు

ప్రతిష్టాత్మక 25వ చిత్రం. పైగా కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. అందుకే మహేష్ ఈసారి మొహమాటాలు పక్కన పెట్టాడు. మహర్షి సినిమా కోసం ఒళ్లొంచ్చి ప్రచారం చేయాలని నిర్ణయించాడు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నాడు సూపర్ స్టార్. బాలీవుడ్ లో ఓ సినిమా రిలీజ్ ఉందంటే చాలు, ఆ సినిమా హీరో హీరోయిన్లు దేశం మొత్తం చుట్టేస్తుంటారు. ప్రతి ముఖ్య పట్టణంలో ఓ ప్రెస్ మీట్ పెడతారు. అంతకుమించి మరెన్నో […]

మహేష్ సుడిగాలి పర్యటనలు
X

ప్రతిష్టాత్మక 25వ చిత్రం. పైగా కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. అందుకే మహేష్ ఈసారి మొహమాటాలు పక్కన పెట్టాడు. మహర్షి సినిమా కోసం ఒళ్లొంచ్చి ప్రచారం చేయాలని నిర్ణయించాడు. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు పట్టణాల్లో సుడిగాలి పర్యటనలు చేయబోతున్నాడు సూపర్ స్టార్.

బాలీవుడ్ లో ఓ సినిమా రిలీజ్ ఉందంటే చాలు, ఆ సినిమా హీరో హీరోయిన్లు దేశం మొత్తం చుట్టేస్తుంటారు. ప్రతి ముఖ్య పట్టణంలో ఓ ప్రెస్ మీట్ పెడతారు. అంతకుమించి మరెన్నో వినూత్న ప్రచార కార్యక్రమాలు చేపడతారు.

మరీ అంతలా కాకపోయినా ఉన్నంతలో కొన్ని సిటీస్ లో పర్యటించబోతున్నాడు మహేష్. ఈ మేరకు ఏప్రిల్ లో రూట్ మ్యాప్ ఖరారు కాబోతోంది.

తమ సినిమా ప్రచారం కోసం హీరోలు ఇలా ఊళ్లు తిరగడం కొత్తేంకాదు. చిన్న హీరోల నుంచి రామ్ చరణ్, బన్నీ లాంటి పెద్ద హీరోల వరకు చాలామంది ఇలా చేశారు. కానీ మహేష్ ఎప్పుడూ ఇలా చేయలేదు. ప్రెస్ ను పిలిచి కూర్చొని ఓ ఇంటర్వ్యూ ఇచ్చేవాడంతే. కానీ ఇప్పుడు మండే ఎండల్లో తిరగడానికి ఫిక్స్ అయ్యాడు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. మే 9న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.

First Published:  21 March 2019 9:03 AM GMT
Next Story