Telugu Global
Cinema & Entertainment

హన్సిక ప్రయోగం సక్సెస్ అయ్యేనా?

దేశముదురు సినిమా తో సినిమాల్లోకి అరంగేట్రం చేసి ఆనతి కాలం లో నే తమిళ్ లో యాభై సినిమాలు పూర్తి చేసిన హన్సిక తన కొత్త చిత్రం గురించి చాలా ఉత్సాహం తో ఉంది. ఆ మధ్య కొన్ని వరుస పరాజయాల తో కెరీర్ స్లో అయింది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ పుంజుకుంది. పార్ట్నర్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని మొదట తెలుగు, తమిళ్ భాషల్లో తీద్దాం అనుకున్నారు. కానీ చివరికి తెలుగు లో […]

హన్సిక ప్రయోగం సక్సెస్ అయ్యేనా?
X

దేశముదురు సినిమా తో సినిమాల్లోకి అరంగేట్రం చేసి ఆనతి కాలం లో నే తమిళ్ లో యాభై సినిమాలు పూర్తి చేసిన హన్సిక తన కొత్త చిత్రం గురించి చాలా ఉత్సాహం తో ఉంది.

ఆ మధ్య కొన్ని వరుస పరాజయాల తో కెరీర్ స్లో అయింది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ పుంజుకుంది. పార్ట్నర్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రాన్ని మొదట తెలుగు, తమిళ్ భాషల్లో తీద్దాం అనుకున్నారు. కానీ చివరికి తెలుగు లో డబ్ చేద్దాం అని నిర్ణయించుకున్నారు.

ఈ సినిమా హన్సిక కి ఒక ప్రయోగం అని చెప్పచ్చు. హన్సిక కూడా తన పాత్ర గురించి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది. “మా కొత్త సినిమా పార్ట్నర్ కి శుభాభినందనలు. టీమ్ అందరికీ విజయం అందాలని కోరుకుంటున్నాను. నేను ఈ సినిమా లో ఎవరి సరసనా నటించడం లేదు. నేను ఈ సినిమా లో వేసే పాత్ర చాలా ప్రత్యేకం గా ఉంటుంది. నేను ఇప్పటి వరకు చేసిన అన్ని పాత్రలోకి చాలా వత్యాసం ఉంది. నేను ఇలాంటి పాత్ర ఇప్పటి దాకా చెయ్యలేదు, అందుకే చాలా ఉత్సాహం గా ఉన్నాను. త్వరలో మీ అందరి ముందుకు రావడానికి ఎదురు చూస్తున్నాను” అని హన్సిక చెప్పింది.

ఆది పినిశెట్టి, పాలక్ కూడా ఈ సినిమా లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

First Published:  21 March 2019 6:13 AM GMT
Next Story