Telugu Global
NEWS

జ‌నసేనకు టీడీపీ ప్రీ పెయిడ్ చార్జింగ్ !

2014లో క‌లిసి పోటీ చేశారు. 2019లో ఆ పాచిక పారే అవ‌కాశం క‌న్పించ‌డం లేదు. దీంతో ఇప్పుడు చీక‌టి పొత్తు రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ప్యాకేజీ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌ని ఇప్ప‌టికే చాలా ప్రచారం న‌డుస్తోంది. ఇన్నాళ్లు తెర‌వెనుక న‌డిచిన రాజ‌కీయం ఇప్పుడు ముందుకు వ‌చ్చింది. జ‌న‌సేన బ‌ల‌మైన క్యాండేట్లు పెట్టిన చోట ఇప్పుడు టీడీపీ బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టేందుకు నిర్ణ‌యించింది. ఇది ఇప్పుడు గుంటూరు టీడీపీలో కాక రేపుతోంది. మాల్యాద్రి శ్రీనివాస్‌, మ‌ద్దాలి గిరిని […]

జ‌నసేనకు టీడీపీ ప్రీ పెయిడ్ చార్జింగ్ !
X

2014లో క‌లిసి పోటీ చేశారు. 2019లో ఆ పాచిక పారే అవ‌కాశం క‌న్పించ‌డం లేదు. దీంతో ఇప్పుడు చీక‌టి పొత్తు రాజ‌కీయాల‌కు తెర‌లేపారు.

టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య ప్యాకేజీ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌ని ఇప్ప‌టికే చాలా ప్రచారం న‌డుస్తోంది. ఇన్నాళ్లు తెర‌వెనుక న‌డిచిన రాజ‌కీయం ఇప్పుడు ముందుకు వ‌చ్చింది. జ‌న‌సేన బ‌ల‌మైన క్యాండేట్లు పెట్టిన చోట ఇప్పుడు టీడీపీ బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టేందుకు నిర్ణ‌యించింది. ఇది ఇప్పుడు గుంటూరు టీడీపీలో కాక రేపుతోంది.

మాల్యాద్రి శ్రీనివాస్‌, మ‌ద్దాలి గిరిని మార్చ‌డంపై త‌మ్ముళ్లు నిర‌స‌న‌కు దిగారు. దీంతో గ‌ల్లా జ‌య‌దేవ్ సీఎం ద‌గ్గ‌ర‌కు ప‌రుగులు పెట్టారు. గుంటూరు జిల్లాలో ఏం జ‌రుగుతుందో త‌న‌కు అర్ధం కావ‌డం లేద‌ని కార్య‌క‌ర్త‌ల‌తో ఆయ‌న వాపోయారు.

జ‌న‌సేన కోసం టీడీపీ ఇప్పుడు త‌న సీట్ల‌లో మార్పులు చేస్తోంది. ఇదే ఇప్పుడు సొంత పార్టీలో వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మ‌వుతోంది. గుంటూరు ప‌శ్చిమ‌లో ఇప్ప‌టికే మ‌ద్దాలిగిరికి టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అక్క‌డ జ‌న‌సేన ముఖ్య‌నేత తోట చంద్ర‌శేఖ‌ర్ కోసం అభ్య‌ర్థిని మార్చేందుకు నిర్ణ‌యించారు. ఇక్క‌డ వేరే సామాజిక అభ్య‌ర్థిని రంగంలోకి దించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప‌వ‌న్ కల్యాణ్ పోటీ చేసే గాజువాక కోసం అక్క‌డ బ‌ల‌మైన అభ్య‌ర్థి ప‌ల్లా శ్రీనివాస్‌ను ఎంపీగా పోటీ చేయించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు.

నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. దీంతో ఇక్క‌డ చైతన్య రాజుని తప్పించి ఎమ్మెల్యే కలవపూడి శివను బ‌రిలోకి దింప‌బోతున్నారు. తెనాలిలో నాదెండ్ల మ‌నోహ‌ర్ కోసం ఆల‌పాటి రాజాను నరసరావుపేట ఎంపీగా పంపుతున్న‌ట్లు స‌మాచారం.

2014లో బీజేపీ, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి టీడీపీ పోటీ చేసింది. దీంతో రెండు శాతం ఓట్ల‌తో బ‌య‌ట‌ప‌డింది. అయితే ఈ సారి క‌లిసి పోటీ చేస్తే కూట‌మి ఎత్తులు పారే అవకాశాలు లేవ‌ని చంద్రబాబు నిర్ణ‌యానికి వచ్చారు. దీంతో ప్ర‌భుత్వ ఓటును చీల్చేందుకు జ‌న‌సేన‌తో పోటీ చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు.

ఇందులో భాగంగానే వామ‌ప‌క్షాల‌తో క‌లిసి ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లను చీల్చే కుట్ర‌కు ప‌న్నాగాలు ర‌చిస్తున్నారు. లెఫ్ట్ పార్టీల‌తో పొత్తు కూడా చంద్ర‌బాబు కుదిర్చార‌ని టాక్ విన్పిస్తోంది. ఎందుకంటే గ‌త కొన్ని రోజులుగా వామ‌ప‌క్ష ప‌త్రిక‌ల్లో ప్ర‌భుత్వ వ్య‌తిరేక వార్త‌లు త‌గ్గాయి.

First Published:  18 March 2019 8:48 PM GMT
Next Story