Telugu Global
NEWS

టీడీపీలో కలకలం... ప్రచారానికి దూరంగా మరో అభ్యర్థి

టీడీపీలో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. టిక్కెట్లు వచ్చిన వారు కూడా ప్రచారంలోకి దిగేందుకు జంకుతున్నారు. ఇప్పటికే శ్రీశైలం టికెట్ దక్కించుకున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ స్థానంలో పోటీకి ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా సుముఖత చూపలేదు. దీంతో ఏవీ సుబ్బారెడ్డిని బుజ్జగించి అక్కడ నిలిపేందుకు  నిర్ణయించారు. ఇంతలో బనగానపల్లి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి పోటీకి […]

టీడీపీలో కలకలం... ప్రచారానికి దూరంగా మరో అభ్యర్థి
X

టీడీపీలో అసాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. టిక్కెట్లు వచ్చిన వారు కూడా ప్రచారంలోకి దిగేందుకు జంకుతున్నారు. ఇప్పటికే శ్రీశైలం టికెట్ దక్కించుకున్న బుడ్డా రాజశేఖర్ రెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ స్థానంలో పోటీకి ఏరాసు ప్రతాప్ రెడ్డి కూడా సుముఖత చూపలేదు. దీంతో ఏవీ సుబ్బారెడ్డిని బుజ్జగించి అక్కడ నిలిపేందుకు నిర్ణయించారు.

ఇంతలో బనగానపల్లి టీడీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి కూడా ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో పరిస్థితులను బేరీజు వేసుకున్న తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి సొంత గ్రామంలోనే కాటసాని రామిరెడ్డి సమక్షంలో భారీగా టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు.

నియోజవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. దీంతో పోటీకి బీసీ తర్జనభర్జన పడుతున్నారు. విషయం తెలుసుకున్న టీడీపీ పెద్దలు బీసీ జనార్దన్ రెడ్డిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

First Published:  18 March 2019 9:50 PM GMT
Next Story