Telugu Global
NEWS

విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీభరత్ వైపే టీడీపీ మొగ్గు..?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా కొన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల సూచన మేరకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అలా ఖాళీగా ఉంచిన నియోజకవర్గాల్లో విశాఖపట్నం లోక్‌సభ కూడా ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ పేరే వినిపిస్తోంది. ఈ మేరకు విశాఖ జిల్లాలోని మెజార్టీ టీడీపీ నాయకుల నుంచి కూడా ఇదే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే జిల్లా మంత్రి […]

విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా శ్రీభరత్ వైపే టీడీపీ మొగ్గు..?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా కొన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఆయా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థుల సూచన మేరకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అలా ఖాళీగా ఉంచిన నియోజకవర్గాల్లో విశాఖపట్నం లోక్‌సభ కూడా ఒకటి.

ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ పేరే వినిపిస్తోంది. ఈ మేరకు విశాఖ జిల్లాలోని మెజార్టీ టీడీపీ నాయకుల నుంచి కూడా ఇదే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు పలు దఫాలుగా ఈ విషయంపై చర్చలు జరిపారు. తాజాగా ఇవాళ మరో సారి భేటీ అయ్యారు. దీనికి శ్రీభరత్‌తో పాటు వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ బాబు, వాసుపల్లి గణేష్, గణబాబు తదితరులు హాజరయ్యారు.

గంటా సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో శ్రీభరత్‌ వైపే అందరూ మొగ్గు చూపినట్లు.. ఆయన కూడా పోటీకి ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధినేత చంద్రబాబుకు ఇదే విషయాన్ని తెలుపుతామని గంటా కూడా మీడియాకు తెలిపారు. గతంలో రెండు సార్లు విశాఖ లోక్‌సభ నియోజకవర్గానికి భరత్ తాతయ్య ఎంవీవీఎస్ మూర్తి ప్రాతినిథ్యం వహించారు. గీతం సంస్థల వ్యవస్థాపకులుగా ఈ కుటుంబం సుపరిచితమే.

అందుకే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తైతే పోటీ గట్టిగా ఉంటుందని భావిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లోపు విశాఖ లోక్‌సభ స్థానంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

First Published:  18 March 2019 4:14 AM GMT
Next Story