Telugu Global
Health & Life Style

నిద్రపోండి.... హాయిగా....

ఆకలి రుచి ఎరగదు…. నిద్ర సుఖం ఎరగదు…. ఎవరికైనా నిద్ర ముంచుకు వస్తే అది కటిక నేలైనా…. పట్టు పరుపులైనా ఒళ్లు తెలియదంటారు. అందుకే వాగ్గేయకారుడు అన్నమయ్య…. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే…. అండనే బంటు నిద్ర అదియూ ఒకటే అన్నారు. నిజంగానే నిద్ర ఒక యోగం…. కొంత మందికి పిలిస్తే వస్తుంది…. కొంతమంది మాత్రం నిద్ర కోసం యుద్దమే చేస్తారు…. మరి ఈ తేడాలు ఎందుకు…. నిద్ర లేమికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం. నిద్ర […]

నిద్రపోండి.... హాయిగా....
X

ఆకలి రుచి ఎరగదు…. నిద్ర సుఖం ఎరగదు…. ఎవరికైనా నిద్ర ముంచుకు వస్తే అది కటిక నేలైనా…. పట్టు పరుపులైనా ఒళ్లు తెలియదంటారు. అందుకే వాగ్గేయకారుడు అన్నమయ్య…. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే…. అండనే బంటు నిద్ర అదియూ ఒకటే అన్నారు.

నిజంగానే నిద్ర ఒక యోగం…. కొంత మందికి పిలిస్తే వస్తుంది…. కొంతమంది మాత్రం నిద్ర కోసం యుద్దమే చేస్తారు…. మరి ఈ తేడాలు ఎందుకు…. నిద్ర లేమికి కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

నిద్ర పట్టకపోవడాన్ని వైద్య పరిభాషలో ‘స్లీపింగ్ డిసార్డర్’ అంటారు. నిజానికి నిద్రలేమి అనేది చిన్న సమస్య కాదు. నిద్ర పట్టకపోవడం అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఆందోళన, కోపం, చిరాకు, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయి.

  • నిద్రలేమికి ప్రధాన కారణం ఊబకాయం. ఊబకాయం ఉన్నవారు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. దీని కారణంగా వారికి నిద్ర పట్టదు.
  • శరీరిక శ్రమ లేకపోవడం కూడ నిద్ర పట్టకపోవడానికి ఓ కారణం.
  • నిద్రలేక పోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు వైద్యులు.
  • నిద్ర పట్టకపోవడం వలన హైపర్ టెన్షన్, హర్ట్ ప్రాబ్లెమ్స్, డయాబెటీస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.
  • నిద్రలేమికి ఒత్తిడి, మారిన జీవనశైలి కూడ కారణంగా చెబుతున్నారు.
  • జంక్ ఫుడ్, అతిగా కాఫీ, టీలు తాగడం కూడా మరో కారణం.
  • ధూమపానం కూడా నిద్ర పట్టకపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.

ఇన్ని సమస్యలు తీసుకువస్తున్న నిద్ర లేమి పోవాలంటే ఇలా చేయాలి…

  • కొంతమంది నిద్ర వస్తున్నప్పుడు టివీ చూస్తూనో, ఫోనుతో కాలక్షాపం చేస్తుంటారు. అలా కాకుండా నిద్ర వస్తున్నప్పుడే పడుకోవడానికి ఉపక్రమిస్తే మంచిది.
  • రాత్రి ఆరు గంటల తర్వాత కాఫీ, టీల జోలికి పోకూడదు.
  • రాత్రి పూట సాత్విక ఆహారం తీసుకోవడమే మేలు.
  • పుస్తక పఠనం నిద్రకు ఒక అద్బుతమైన చిట్కా.
  • రోజు ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
  • చాలా మంది పగటిపూట నిద్ర పోతారు. అయితే ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల రాత్రిళ్లు నిద్ర పట్టదు.
  • రాత్రిళ్లు పుల్లగా ఉండే ఆహారం తీసుకోకూడదు. దీని వల్ల ఎసిడిటీ పెరిగి నిద్రను దూరం చేస్తుంది.
  • రాత్రి పడుకోబోయే ముందు గోరు వెచ్చటి పాలు తాగితే చాలా మంచిది, నిద్రపట్టే అవకాశం ఉంది.
  • ఈ నియమాలు పాటించి హాయిగా… కంటి నిండా నిద్రపొండి.
First Published:  17 March 2019 5:04 PM GMT
Next Story