Telugu Global
NEWS

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.... నేటి నుంచే నామినేషన్లు

ఏపీలోని 25 లోక్‌సభ, 175 శాసన సభ స్థానాలకు జరుగనున్న ఎన్నికలకు నోటిషికేషన్ కొద్ది సేపటి క్రితం రాష్ట్ర సీఈవో గోపాలకృష్ణ ద్వివేది విడుదల చేశారు. అలాగే మరి కొద్ది సేపట్లోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. ఈ మేరకు సీఈవో ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రతీ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. […]

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.... నేటి నుంచే నామినేషన్లు
X

ఏపీలోని 25 లోక్‌సభ, 175 శాసన సభ స్థానాలకు జరుగనున్న ఎన్నికలకు నోటిషికేషన్ కొద్ది సేపటి క్రితం రాష్ట్ర సీఈవో గోపాలకృష్ణ ద్వివేది విడుదల చేశారు. అలాగే మరి కొద్ది సేపట్లోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. ఈ మేరకు సీఈవో ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఇవాళ 11 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రతీ రోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. నామినేషన్లకు ఆఖరు తేదీ ఈ నెల 25 మధ్యాహ్నం 3 గంటలు. ఇక 26వ తేదీ నామినేషన్ల పరిశీలన, 28వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ గడువుగా నిర్ణయించారు. ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించి.. మే 23న ఫలితాలు ప్రకటిస్తారు.

మరోవైపు తొలిదశ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ స్థానాలకు కూడా ఇవాల్టి నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు.

First Published:  17 March 2019 11:40 PM GMT
Next Story