Telugu Global
NEWS

అభ్యర్ధుల ఎంపికపై వైసీపీలో వ్యతిరేకత లేదు.... మీరెందుకు భయపడతారు?

“ఇన్నాళ్లూ మీ మాట మేం విన్నాం. ఇక మీరు మా మాట వినండి. మీరు ఊహించినట్లుగా పరిస్ధితులు లేవు. వాస్తవాలు తెలుసుకోండి” ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వివిధ జిల్లాలకు చెందిన తెలుగు తమ్ముళ్ల సూచనలు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతోను, అభ్యర్దులతోను ప్రతిరోజూ టెలీ కాన్ఫరేన్సులు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలలో పార్టీ గెలుపు తథ్యం అని ఏ నియోజకవర్గంలో చూసినా గెలుపు ఖాయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. సోమవారం […]

అభ్యర్ధుల ఎంపికపై వైసీపీలో వ్యతిరేకత లేదు.... మీరెందుకు భయపడతారు?
X

“ఇన్నాళ్లూ మీ మాట మేం విన్నాం. ఇక మీరు మా మాట వినండి. మీరు ఊహించినట్లుగా పరిస్ధితులు లేవు. వాస్తవాలు తెలుసుకోండి” ఇది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి వివిధ జిల్లాలకు చెందిన తెలుగు తమ్ముళ్ల సూచనలు.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులతోను, అభ్యర్దులతోను ప్రతిరోజూ టెలీ కాన్ఫరేన్సులు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలలో పార్టీ గెలుపు తథ్యం అని ఏ నియోజకవర్గంలో చూసినా గెలుపు ఖాయమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

సోమవారం నాడు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కూడా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని పార్టీ విజయం సాధించినట్లేనని నాయకులతో చంద్రబాబు అన్నారు. అయితే టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గున్న నాయకులు అన్ని జిల్లాలలోను పార్టీ పరిస్థితి బాగోలేదని ఆ విషయాన్ని గుర్తించకుండా చంద్రబాబు మాట్లాడడం హస్యాస్పదంగా ఉందంటూ వ్యాఖ్యనిస్తున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో సానుకూలత వ్యక్తం అవుతోందని ముఖ్యంగా బీసీలు, యువకులు, మహిళలు ఆ పార్టీ పట్ల ఆదరణ చూపిస్తున్నారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. “మీడియాతో ఇన్నాళ్లు చేసిన గోబెల్స్ ప్రచారాన్ని పార్టీ వారికి కూడా చేయకండి వాస్తవాలను వినండి” అని తెలుగు తమ్ముళ్లు హితవు పలుకుతున్నారు.

ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి అభ్యర్దులను ప్రకటించినా ఎటువంటి వ్యతిరేకత రాలేదని అది ఆ పార్టీ ఎదుగుదలకు సూచిక అని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.

అధికారంలో ఉండి కూడా అభ్యర్దులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతున్నామని ఈ వాస్తవాలను అంగీకరించకుండా అంత బాగానే ఉందనుకోవడం మంచిది కాదని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారు.

First Published:  18 March 2019 5:30 AM GMT
Next Story