Telugu Global
NEWS

అత్యుత్తమ అభ్యర్ధులతో రంగంలోకి వైసీపీ

ఈ రోజు ఉదయం ఇడుపులపాయలో విడుదల చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధుల్లో ఎక్కువ మంది యువకులు, విద్యాధికులు, అనుభవజ్ఞులు ఉండడం విశేషం. గత ఎన్నికల సమయంలో కూడా బీసీల పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం కన్నా వైసీపీ ఎక్కువ మంది బీసీలకు సీట్లు ఇచ్చింది. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా బీసీ అభ్యర్ధులకు పెద్ద పీట వేసింది వైసీపీ. సుమారు 45 మంది బీసీ అభ్యర్ధులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చి రికార్డు నెలకొల్పాడు ఆ పార్టీ అధ్యక్షుడు […]

అత్యుత్తమ అభ్యర్ధులతో రంగంలోకి వైసీపీ
X

ఈ రోజు ఉదయం ఇడుపులపాయలో విడుదల చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధుల్లో ఎక్కువ మంది యువకులు, విద్యాధికులు, అనుభవజ్ఞులు ఉండడం విశేషం.

గత ఎన్నికల సమయంలో కూడా బీసీల పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం కన్నా వైసీపీ ఎక్కువ మంది బీసీలకు సీట్లు ఇచ్చింది.

ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా బీసీ అభ్యర్ధులకు పెద్ద పీట వేసింది వైసీపీ. సుమారు 45 మంది బీసీ అభ్యర్ధులకు పార్టీ టిక్కెట్లు ఇచ్చి రికార్డు నెలకొల్పాడు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి.

  • వైసీపీ ప్రకటించిన అభ్యర్ధుల్లో 9 మంది ఆల్‌ఇండియా సర్వీసుల్లో పనిచేసినవారు. మరో 15 మంది డాక్టర్లు.
  • వైసీపీ ప్రకటించిన 175 అభ్యర్థుల్లో….. 45 ఏళ్లలోపు వారు 33 మంది.
  • 45 నుంచి 60 ఏళ్లలోపు వారు 98 మంది.
  • 60 ఏళ్లకు పైబడ్డ వారు కేవలం 44 మంది మాత్రమే
  • మొత్తం 175 మంది అభ్యర్ధుల్లో గతంలో మంత్రులుగా పనిచేసినవారు 12 మంది. మాజీ ఎమ్మెల్సీలు 37 మంది. ఒకరు ఎంపీ. మూడు సార్లు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు 21 మంది.
  • మొత్తం అభ్యర్ధుల్లో 119 మంది గతంలో వివిధ పదవులలో పనిచేసిన వారు.
  • మొత్తం అభ్యర్ధుల్లో పోస్టు గ్రాడ్యుయేట్ లు 41 మంది…. డిగ్రీ, ఆపైన చదివిన వారు 139 మంది.

కులాల వారిగా చూసుకుంటే….

బీసీలకు – 45, ఎస్సీలకు – 29, ఎస్టీలకు – 7, కాపులకు – 31, ముస్లింలకు – 5, బ్రాహ్మణులకు – 4, వైశ్యులకు – 3 సీట్లు కేటాయించారు.

మొత్తం అభ్యర్ధుల్లో మహిళలు 15 మంది.

అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇస్తూ సామాజిక న్యాయాన్ని పాటిస్తూ అత్యుత్తమ అభ్యర్ధులతో ఎన్నికల రంగంలోకి దిగుతోంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.

First Published:  17 March 2019 1:50 AM GMT
Next Story