Telugu Global
Cinema & Entertainment

లక్ష్మీస్ ఎన్టీఆర్.... వచ్చేది డౌటే!

ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే వచ్చేసింది. కానీ కీలకమైన, అందరికీ ఆసక్తికరమైన ఎపిసోడ్ ను మాత్రం పక్కనపెట్టేశారు. అలా పక్కన పడేసిన ఎపిసోడ్ తో అసలైన బయోపిక్ తీశాడు వర్మ. దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుపెట్టాడు. టీడీపీ జనాల్ని, మరీ ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ప్రచారం కూడా జోరుగా చేస్తున్నాడు. అయితే అంతా భావిస్తున్నట్టు ఈ సినిమా 22కు వచ్చేది అనుమానంగానే ఉంది. ఇంకా 6 రోజులు మాత్రమే సమయం ఉంది. దీనిపై ఇప్పటికే టీడీపీ […]

లక్ష్మీస్ ఎన్టీఆర్.... వచ్చేది డౌటే!
X

ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పటికే వచ్చేసింది. కానీ కీలకమైన, అందరికీ ఆసక్తికరమైన ఎపిసోడ్ ను మాత్రం పక్కనపెట్టేశారు. అలా పక్కన పడేసిన ఎపిసోడ్ తో అసలైన బయోపిక్ తీశాడు వర్మ. దానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే పేరుపెట్టాడు. టీడీపీ జనాల్ని, మరీ ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ప్రచారం కూడా జోరుగా చేస్తున్నాడు. అయితే అంతా భావిస్తున్నట్టు ఈ సినిమా 22కు వచ్చేది అనుమానంగానే ఉంది.

ఇంకా 6 రోజులు మాత్రమే సమయం ఉంది. దీనిపై ఇప్పటికే టీడీపీ వాళ్లు కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. అది తమ పరిధిలో లేదని వాళ్లు తప్పించుకున్నారు. ఇప్పుడు బంతి సెన్సార్ కోర్టులోకి వెళ్లింది. సెన్సార్ అధికారులు మాత్రం ఈ సినిమాపై ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు. వాళ్ల పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యి అన్నట్టు తయారైంది.

ఇలా జాప్యం చేయడం వల్లనే లక్ష్మీస్ ఎన్టీఆర్ వాయిదా పడుతోంది. ఈ 6 రోజుల్లో సినిమాకు లైన్ క్లియర్ అవ్వడం కష్టం. సో.. ఆ తర్వాత వారం అంటే 29న విడుదల చేసుకోవడమే. అయితే మేకర్స్ మాత్రం రిలీజ్ పై చాలా పట్టుమీదున్నారు. ఎలాగైనా సెన్సార్ అధికారుల్ని కూర్చోబెట్టి, వాళ్లను ఒప్పంచి ఎట్టి పరిస్థితుల్లో 22కే వచ్చేయాలని చూస్తున్నారు.

ఒకవేళ 22న కాని పక్షంలో 26 లేదా 27న థియేటర్లలోకి బొమ్మను తీసుకొచ్చేయాలని నిర్మాతలు తెగ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఆలస్యం చేసేకొద్దీ సినిమాపై క్రేజ్ తగ్గిపోతుందనేది వాళ్ల భయం.

First Published:  16 March 2019 8:53 PM GMT
Next Story