Telugu Global
Health & Life Style

కిడ్నీలో రాళ్లు....

మానవదేహంలో ఉన్న మలినాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు ముఖ్యపాత్ర పోషిస్తుంటాయి. వీటినే కిడ్నీలు అని వ్యవహరిస్తారు. కిడ్నీలకు ఒక్కసారి సమస్య వచ్చిందంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఈ మద్య కాలంలో అనేక మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాలకు వైద్యమంటే సామాన్యుడికి అందుబాటులో ఉండదు. ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మూత్రపిండాల సమస్యను ముందుగా గుర్తించకపోవడం కూడా ఈ సమస్య తీవ్రమవుతోందని నిపుణులు అంటున్నారు .ఈ వ్యాధిని ఎలా గుర్తించాలో తెల్సుకుందాం. కిడ్నీలో రాళ్లు…. ఆహారంలో లవణాలు అధికంగా […]

కిడ్నీలో రాళ్లు....
X

మానవదేహంలో ఉన్న మలినాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు ముఖ్యపాత్ర పోషిస్తుంటాయి. వీటినే కిడ్నీలు అని వ్యవహరిస్తారు. కిడ్నీలకు ఒక్కసారి సమస్య వచ్చిందంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.

ఈ మద్య కాలంలో అనేక మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూత్రపిండాలకు వైద్యమంటే సామాన్యుడికి అందుబాటులో ఉండదు. ఎంతో ఖర్చుతో కూడుకున్నది. మూత్రపిండాల సమస్యను ముందుగా గుర్తించకపోవడం కూడా ఈ సమస్య తీవ్రమవుతోందని నిపుణులు అంటున్నారు .ఈ వ్యాధిని ఎలా గుర్తించాలో తెల్సుకుందాం.

కిడ్నీలో రాళ్లు….

  • ఆహారంలో లవణాలు అధికంగా ఉంటే అవి ఘన పదార్ధలుగా మారి కిడ్నీలలో రాళ్లుగా ఏర్పాడతాయి.
  • దీని కారణంగా మొదట్లో ఆకలి మందగించడం, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడితే మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట వస్తుంది.
  • డొక్కా, వెన్నుల్లో ఎక్కువగా నొప్పిగా ఉంటే దాన్ని కిడ్నీ సమస్యగా గుర్తించాలి.
  • మూత్రం చెడు వాసన వస్తున్నా, రక్తం పడుతున్నా లేదా మూత్రం ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెం వస్తున్నా కూడా కిడ్నీ సమస్యతో ఉన్నట్లు గుర్తించి వెంటనే వైద్యడిని సంప్రందించాలి.
  • ఒక్కోసారి మూత్రం రంగు కూడా మారుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.
  • ఈ సమస్య తొలి దశలో ఉన్నప్పుడు కొన్ని చిట్కాలు పాటించి నయం చేసుకోవచ్చు
  • పండ్లలో నీటి శాతం అధికంగా ఉన్న పళ్లను ఎక్కువగా తీసుకోవాలి.
  • నల్ల ఉలవలను ఉడికించి వాటి పైన తేటగా వచ్చే నీటిని తాగితే కిడ్నీలకు చాలా మంచిది.
  • మూత్రపిండాలు సమస్యకు మంచినీరు ఎక్కువగా తాగాలని చాలామంది సలహా ఇస్తారు. కాని మోతాదుకు మించి నీరు తీసుకుంటే మూత్రపిండాలపై వొత్తిడి ఎక్కువై సమస్య ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.
  • తేనేలో కొన్ని తులసి ఆకులు కలుపుకుని పొద్దునే తాగితే రాళ్లు నెమ్మది నెమ్మదిగా కరిగిపోతాయి.

కిడ్నీ వ్యాధిలో ప్రధానమైన డయాలసిస్ అంటే ఏమిటి..?

మూత్రపిండాలు మలినాలు బయటకి పంపడంలో విఫలం అవుతాయి. అలాంటప్పుడు డయాలసిస్ అవసరం అవుతుంది.

  • శరీరం నుంచి అధిక నీటిని తొలగించి తగిన మోతాదులో నీరు నిలువ ఉండేలా చూసుకోవాలి.
  • రక్త పరీక్షలో సీరం క్రియాటినిన్ 10 మీల్లీగ్రాములు కంటే ఎక్కువగా ఉంటే కనుక డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది.
  • డయాలసిస్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ రోగి తక్కువ పరిమాణంలో ఆహారం, అంతే కొలమానంలో నీరు తీసుకోవాలి.
  • ఉప్పు, పొటాషియం తక్కువగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. అంతే కాకుండా ఆహారంలో ప్రొటీన్లు, విటమిన్లు ఉండేలా చూసుకోవాలి.

డయాలసిస్…. రెండు రకాలు….

  1. హిమోడయాలసిస్ : కృత్తిమ మూత్రపిండాల ద్వారా రక్తన్ని శుద్ది చేస్తారు. దీనినే హిమోడయాలసిస్ అంటారు.
  2. పెరిటోనియల్ డయాలసిస్: శరీరంలో నిలువ ఉన్న వ్యర్థ పదార్థాలను ప్రత్యేకమైన మందులతో తీసేసి శుద్ధి చేస్తుంది. ఈ పద్దతిలో డయాలసిస్ యంత్రాలతో అవసరం ఉండదు.

కిడ్నీలకు సంబంధించి పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

First Published:  16 March 2019 8:36 PM GMT
Next Story