Telugu Global
Cinema & Entertainment

పెద్ద హీరో.... పెద్ద మొత్తం....

వరుసగా ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ లాంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మధ్యనే ‘ఎఫ్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అవడంతో అనిల్ రావిపూడి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకుని ప్రొడ్యూసర్ లను తన ఇంటి ముందు క్యూ కట్టేలా చేసుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి ఇమేజ్ మాత్రమే కాక రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిందని తెలుస్తోంది. […]

పెద్ద హీరో.... పెద్ద మొత్తం....
X

వరుసగా ‘పటాస్’, ‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’ లాంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ మధ్యనే ‘ఎఫ్ 2’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. చేసిన నాలుగు సినిమాలు సూపర్ హిట్ అవడంతో అనిల్ రావిపూడి తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకుని ప్రొడ్యూసర్ లను తన ఇంటి ముందు క్యూ కట్టేలా చేసుకున్నాడు.

తాజా సమాచారం ప్రకారం అనిల్ రావిపూడి ఇమేజ్ మాత్రమే కాక రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిందని తెలుస్తోంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు రెండు రెట్లు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తుంది.

ఇప్పటివరకు అనిల్ సినిమాకు 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే వాడని అంటున్నారు. కానీ ‘ఎఫ్ 2’ సినిమా తరువాత మహేష్ బాబుతో చేస్తున్న సినిమా కోసం పెద్దమొత్తంలో…. అక్షరాలా 9 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. తన రెమ్యునరేషన్ ను దాదాపు రెండింతలు డిమాండ్ చేస్తున్నాడట ఈ దర్శకుడు.

అయినా సరే అనిల్ రావిపూడి అడిగినంత ఇచ్చేందుకు రెడీ అంటున్నారు నిర్మాతలు. ‘ఎఫ్ 2’ నిర్మించిన దిల్ రాజే అనిల్ సుంకర తో కలిసి మహేష్ బాబు-అనిల్ రావిపూడి సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

First Published:  16 March 2019 11:19 PM GMT
Next Story