Telugu Global
NEWS

సేఫ్ సీటు కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ సెర్చ్ ఆప‌రేష‌న్ !

టీడీపీలో నారా లోకేష్‌కి ఓ సీటు దొరికింది. మొన్న‌టి దాకా ఆయ‌న సేఫ్ సీటు కోసం తీవ్రంగా వెతికారు. ఎక్క‌డి నుంచి పోటీ చేయాల‌నే విష‌యంపై ప్రత్యేక టీముల‌తో సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు. భీమిలి నుంచి పోటీ చేస్తున్నట్లు మొద‌ట లీకులు ఇచ్చారు. కుప్పం నుంచి పోటీ చేస్తార‌ని మరోసారి ప్ర‌చారం చేశారు. తరువాత కృష్ణా జిల్లా నుంచి బ‌రిలో ఉంటార‌న్న విష‌యాన్ని తెర‌పైకి తెచ్చారు. చివ‌ర‌కు రాజ‌ధాని ఏరియాలోని మంగ‌ళ‌గిరిని లోకేష్ ఎంచుకున్నారు. ఇక్క‌డ కొత్త‌గా టీడీపీ సానుభూతి […]

సేఫ్ సీటు కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ సెర్చ్ ఆప‌రేష‌న్ !
X

టీడీపీలో నారా లోకేష్‌కి ఓ సీటు దొరికింది. మొన్న‌టి దాకా ఆయ‌న సేఫ్ సీటు కోసం తీవ్రంగా వెతికారు. ఎక్క‌డి నుంచి పోటీ చేయాల‌నే విష‌యంపై ప్రత్యేక టీముల‌తో సెర్చ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు.

భీమిలి నుంచి పోటీ చేస్తున్నట్లు మొద‌ట లీకులు ఇచ్చారు. కుప్పం నుంచి పోటీ చేస్తార‌ని మరోసారి ప్ర‌చారం చేశారు. తరువాత కృష్ణా జిల్లా నుంచి బ‌రిలో ఉంటార‌న్న విష‌యాన్ని తెర‌పైకి తెచ్చారు. చివ‌ర‌కు రాజ‌ధాని ఏరియాలోని మంగ‌ళ‌గిరిని లోకేష్ ఎంచుకున్నారు.

ఇక్క‌డ కొత్త‌గా టీడీపీ సానుభూతి ప‌రులైన ప‌ది నుంచి 20 వేల మందిని ఓట‌ర్ల జాబితాలో చేర్పించిన‌ట్లు తెలుస్తోంది. అన్ని ర‌కాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్న త‌ర్వాతే మంగ‌ళ‌గిరిని లోకేష్ ఎంచుకున్నార‌ని అంటున్నారు.

లోకేష్ సీటు క‌ష్టాలు తీరాయి… కానీ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మాత్రం సీటు బెంగ ప‌ట్టుకుంది. ఆయ‌న ఎక్క‌డి నుంచి పోటీ చేస్తార‌నే విష‌యంపై ఇంకా స‌స్పెన్స్ కొనసాగుతోంది. ప్ర‌జారాజ్యంలో చిరంజీవికి ఎదురైన చేదు అనుభవాల దృష్ట్యా…. ప‌వ‌న్ క‌ల్యాణ్ సీటు విష‌యంపై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

ప‌వ‌న్ క‌ల్యాణ్ గాజువాక లేదా భీమ‌వరం లేదా భీమిలి నుంచి పోటీ చేస్తార‌ని లేటెస్ట్‌గా తెలుస్తోంది. ఇప్ప‌టికే టీడీపీ గాజువాక‌, భీమిలి సీట్ల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ కోస‌మే ప్ర‌క‌టించ‌లేద‌ని అంటున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ నియోజ‌క‌వ‌ర్గం ఎంచుకున్న త‌ర్వాత అక్క‌డ టీడీపీ డ‌మ్మీ క్యాండేట్‌ లను పెడుతుందని స‌మాచారం.

అయితే జ‌న‌సేన నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం గాజువాక నుంచి ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌రిలో ఉండే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

First Published:  16 March 2019 6:20 AM GMT
Next Story