Telugu Global
NEWS

జేసీ నోట ఓటమి మాట

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలో నలుగురు, ఐదుగురు అభ్యర్థులను మార్చకపోతే తమ కుటుంబం ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం లేదని ప్రకటించారు. ఈనేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి… కీలక విషయాలు చెప్పారు. తాను స్క్రీనింగ్ కమిటీతో మాట్లాడినట్టు చెప్పారు. వారు చెప్పిన జాబితాను చూస్తే అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో టీడీపీ తరపున పోటీ చేసే నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు సరైన వారు కాదని వ్యాఖ్యానించారు. వారు గెలుస్తారన్న నమ్మకం తనకు […]

జేసీ నోట ఓటమి మాట
X

ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం పార్లమెంట్ పరిధిలో నలుగురు, ఐదుగురు అభ్యర్థులను మార్చకపోతే తమ కుటుంబం ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం లేదని ప్రకటించారు.

ఈనేపథ్యంలో మీడియాతో మాట్లాడిన జేసీ దివాకర్ రెడ్డి… కీలక విషయాలు చెప్పారు. తాను స్క్రీనింగ్ కమిటీతో మాట్లాడినట్టు చెప్పారు. వారు చెప్పిన జాబితాను చూస్తే అనంతపురం పార్లమెంట్‌ పరిధిలో టీడీపీ తరపున పోటీ చేసే నలుగురు, ఐదుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు సరైన వారు కాదని వ్యాఖ్యానించారు.

వారు గెలుస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. ఆ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకపోతే ఎంపీ అభ్యర్థి కూడా గెలిచే అవకాశం లేదని చెప్పారు. అందుకే ఎంపీ అభ్యర్థిగా తమ కుటుంబం నుంచి బరిలో ఉండాలా? వద్దా? అన్న దానిపై ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు.

చంద్రబాబుతో మాట్లాడుతానని… ఒకవేళ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకపోతే తాము బరిలో దిగబోమని స్పష్టం చేశారు. పోటీ చేశాక గెలిచి తీరతామన్నది తమ కుటుంబం ఉద్దేశమని… కానీ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చకపోతే ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశం లేదన్నారు.

First Published:  16 March 2019 1:00 AM GMT
Next Story