Telugu Global
National

స్కెచ్‌ చంద్రబాబు, లోకేష్‌ది.... అమలు ఆదినారాయణరెడ్డిది

వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ హత్యకు సూత్రధారులు చంద్రబాబు, నారా లోకేష్ కాగా…కుట్రను అమలు చేసింది మంత్రి ఆదినారాయణరెడ్డి అని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆదినారాయణరెడ్డి మనిషి కాదని.. ఒక దుర్మార్గుడు అని అన్నారు. నీతి జాతి లేని వ్యక్తి ఆదినారాయణరెడ్డి అని ఫైర్ అయ్యారు. ఆదినారాయణ రెడ్డి మనిషి జాతికే కళంకం అన్నారు. 1998 నుంచే వైఎస్ కుటుంబాన్ని చంద్రబాబు టార్గెట్ చేశారన్నారు. రాజారెడ్డిని హత్య చేసిన వారికి టీడీపీ ఆఫీస్‌లో ఆశ్రయం కల్పించారని […]

స్కెచ్‌ చంద్రబాబు, లోకేష్‌ది.... అమలు ఆదినారాయణరెడ్డిది
X

వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ హత్యకు సూత్రధారులు చంద్రబాబు, నారా లోకేష్ కాగా…కుట్రను అమలు చేసింది మంత్రి ఆదినారాయణరెడ్డి అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

ఆదినారాయణరెడ్డి మనిషి కాదని.. ఒక దుర్మార్గుడు అని అన్నారు. నీతి జాతి లేని వ్యక్తి ఆదినారాయణరెడ్డి అని
ఫైర్ అయ్యారు. ఆదినారాయణ రెడ్డి మనిషి జాతికే కళంకం అన్నారు.

1998 నుంచే వైఎస్ కుటుంబాన్ని చంద్రబాబు టార్గెట్ చేశారన్నారు. రాజారెడ్డిని హత్య చేసిన వారికి టీడీపీ ఆఫీస్‌లో ఆశ్రయం కల్పించారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి మరణానికి సరిగ్గా రెండు రోజుల ముందు ఎవరు ఫినిష్ అవుతారో చూద్దామని చంద్రబాబు వ్యాఖ్యానించారన్నారు.

ఇటీవలే విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌ను హత్యచేసేందుకు ప్రయత్నించారన్నారు. డీజీపీ తీరు అనుమానాస్పదంగా ఉన్న నేపథ్యంలో ఇక ఆయన కింద ఉండే పోలీసులు చేసే దర్యాప్తు నిజాయితీగా సాగుతుందని ఎలా భావిస్తామని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

పత్తికొండ వైసీపీ ఇన్ చార్జ్ నారాయణ రెడ్డిని హత్య చేసి ఆ కేసును కూడా నీరు గార్చారన్నారు. కాబట్టి వివేకా హత్యపై ఏర్పాటు చేసిన సిట్ పై తమకు నమ్మకం లేదన్నారు.

First Published:  15 March 2019 8:01 AM GMT
Next Story