Telugu Global
NEWS

ఖ‌మ్మం గులాబీ టికెట్ ఆయ‌న‌కే?  పొంగులేటి వ‌ల‌స వెళ్తారా?

ఖ‌మ్మం లోక్‌స‌భ టీఆర్ఎస్ టికెట్ ఎవ‌రికి ద‌క్క‌బోతుంది? ప్ర‌స్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మ‌రోసారి ఇక్క‌డి నుంచి ఎంపీగా పోటీ చేస్తారా? అనేది స‌స్పెన్స్‌గా మారింది. అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఫ‌లితాల‌తో నిరాశ‌ప‌డ్డ కేసీఆర్‌… మ‌రోసారి ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేందుకు ఇష్టంగా లేర‌ని తెలుస్తోంది. దీంతో మ‌హీంద్రా మోటార్స్ షోరూమ్‌ల అధినేత వంకాయ‌లపాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈయ‌న చాలా కాలంగా కాంగ్రెస్‌లో ఉన్నారు. ఈయ‌న‌కు కాంగ్రెస్ కూడా […]

ఖ‌మ్మం గులాబీ టికెట్ ఆయ‌న‌కే?  పొంగులేటి వ‌ల‌స వెళ్తారా?
X

ఖ‌మ్మం లోక్‌స‌భ టీఆర్ఎస్ టికెట్ ఎవ‌రికి ద‌క్క‌బోతుంది? ప్ర‌స్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మ‌రోసారి ఇక్క‌డి నుంచి ఎంపీగా పోటీ చేస్తారా? అనేది స‌స్పెన్స్‌గా మారింది.

అయితే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం ఫ‌లితాల‌తో నిరాశ‌ప‌డ్డ కేసీఆర్‌… మ‌రోసారి ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేందుకు ఇష్టంగా లేర‌ని తెలుస్తోంది. దీంతో మ‌హీంద్రా మోటార్స్ షోరూమ్‌ల అధినేత వంకాయ‌లపాటి రాజేంద్ర‌ప్ర‌సాద్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈయ‌న చాలా కాలంగా కాంగ్రెస్‌లో ఉన్నారు. ఈయ‌న‌కు కాంగ్రెస్ కూడా టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా లైన్‌లో ఉంది. దీంతో ఈయ‌న టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్ కూడా ఈయ‌న వైపే చూస్తోంది.

ఖ‌మ్మం నుంచి రాజేంద్ర‌ప్ర‌సాద్ పోటీ చేస్తే… పొంగులేటి ఏం చేస్తార‌నేది ఇంట్రెస్టింగ్ గా మారింది. కాంగ్రెస్‌లోకి ర‌మ్మ‌ని ఆ పార్టీ ఆహ్వానిస్తోంది. ఈయ‌న మాత్రం టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

కానీ జిల్లా టీఆర్ఎస్ నేత‌లు, ముఖ్యంగా తుమ్మల నాగేశ్వర రావు మాత్రం ఆయ‌న ప‌ట్ల ఇష్టంగా లేరు. ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు మంచి పేరుంది. కానీ పార్టీలో మాత్రం ఆయ‌న‌కు వ్యతిరేకులు ఉన్నారు. టీఆర్ఎస్ టికెట్ కోసం కేసీఆర్ చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. అయితే న‌ల్గొండ నుంచి పోటీ చేయాల‌ని కేసీఆర్ అడిగిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పొంగులేటి తేల్చుకోలేక‌పోతున్నారు.

ఇక ఖ‌మ్మం కాంగ్రెస్ టికెట్‌పై నామా నాగేశ్వ‌ర‌రావు పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఖ‌మ్మం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయారు. ఎంపీగా కాంగ్రెస్ టికెట్ కోసం ట్ర‌య్ చేశారు. రాహుల్‌ను క‌లిశారు… హామీ ల‌భించ‌లేదు. ఏకంగా టీఆర్ ఎస్ టికెట్ కోసం ట్ర‌య్ చేశారు. కేసీఆర్ తో మాట్లాడితే కుద‌ర‌దు పొమ్మ‌న్నారు. చివ‌ర‌కు కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసే చాన్స్ ఉందని అంటున్నారు.

First Published:  15 March 2019 3:59 AM GMT
Next Story