Telugu Global
Cinema & Entertainment

సునీల్ చిన్ననాటి 'చిత్రలహరి' జ్ఞాపకాలు.... సాయి ధరమ్ కోసం దర్శకుడిగా మారాలని ఉంది.... 

కొన్నాళ్ళు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సునీల్ మళ్లీ కామెడీ పాత్రలు చేయడానికి మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సునీల్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘చిత్రలహరి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ తనకు సాయి ధరమ్ అంటే చాలా ఇష్టమని… తనని చూస్తే ముచ్చటేసేదని…. సాయి కోసం తాను దర్శకుడిగా మారి పోయి తన తో […]

సునీల్ చిన్ననాటి చిత్రలహరి జ్ఞాపకాలు.... సాయి ధరమ్ కోసం దర్శకుడిగా మారాలని ఉంది.... 
X

కొన్నాళ్ళు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సునీల్ మళ్లీ కామెడీ పాత్రలు చేయడానికి మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సునీల్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘చిత్రలహరి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ తనకు సాయి ధరమ్ అంటే చాలా ఇష్టమని… తనని చూస్తే ముచ్చటేసేదని…. సాయి కోసం తాను దర్శకుడిగా మారి పోయి తన తో సినిమా చేయాలని అనిపించేది అని చెప్పుకొచ్చాడు.

ఇక తన చిన్ననాటి ‘చిత్రాలహరి’ జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, “చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళకుండా సినిమాలకి వెళ్ళేవాడిని… ప్రతిరోజు సాయంత్రం ట్యూషన్ ఎగ్గొట్టి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని. కానీ ప్రతి శుక్రవారం మాత్రం తప్పకుండా ట్యూషన్ కి వెళ్లేవాడిని…. ఎందుకంటే ట్యూషన్ మాస్టర్ ఇంట్లో ఒక టీవీ ఉండేది. అక్కడ మంచం కింద దూరి చిత్రలహరి చూస్తుంటే మాస్టర్ నా కాళ్లు పట్టుకుని బయటకు లాగేసేవాళ్ళు” అని చెప్పుకొచ్చాడు సునీల్.

నివేత పేతురాజ్, కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ లుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 12 న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

First Published:  14 March 2019 12:45 AM GMT
Next Story