Telugu Global
Health & Life Style

అలా బరువు తగ్గితే.... ఆరోగ్యానికి హానికరం

అధిక బరువు, ఒబిసీటీ, స్ధూలకాయం ఈ మాటలు మనం తరచు వింటూ వుంటాం. అయితే అధిక బరువు తగ్గించుకోవడానికి చాల వెయిట్ రిడక్షన్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. వీరు వ్యాయమం లేకుండా బరువు తగ్గిస్తాం, నోటిని కట్టుకోవాల్సిన అవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉండవు అంటూ ప్రకటనలు చూసి మోసపోవద్దు. వ్యాయమం లేకుండా, నోరు కట్టుకోకుండా అతి కొద్ది రోజులలో బరువు తగ్గడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. కృత్రిమ పద్దతుల ద్వారా బరువు తగ్గినా ఆ తర్వాత […]

అలా బరువు తగ్గితే.... ఆరోగ్యానికి హానికరం
X

అధిక బరువు, ఒబిసీటీ, స్ధూలకాయం ఈ మాటలు మనం తరచు వింటూ వుంటాం. అయితే అధిక బరువు తగ్గించుకోవడానికి చాల వెయిట్ రిడక్షన్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. వీరు వ్యాయమం లేకుండా బరువు తగ్గిస్తాం, నోటిని కట్టుకోవాల్సిన అవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ అసలే ఉండవు అంటూ ప్రకటనలు చూసి మోసపోవద్దు.

వ్యాయమం లేకుండా, నోరు కట్టుకోకుండా అతి కొద్ది రోజులలో బరువు తగ్గడం సాధ్యం కాదంటున్నారు నిపుణులు. కృత్రిమ పద్దతుల ద్వారా బరువు తగ్గినా ఆ తర్వాత వారు ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాస్త ఓపికతో ఉంటే ఎటువంటి సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బరువు తగ్గించుకోవచ్చునని, అయితే దానికి తగిన సమయం, ఓపిక కావాలని అంటున్నారు.

  • ఆహారంలో కొవ్వుపదార్దలకు బదులు ఎక్కువ ప్రోటీన్ ఉండే ఆహారం తీసుకోవాలి.
  • ఆహారం అంతా ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా తీసుకోవాలి.
  • రోజు 7 లేక 8 గంటలు మాత్రమే నిద్ర పోవాలి. మధ్యహ్నం నిద్ర అస్సలు పనికిరాదు.
  • అధిక బరువు ఉన్నవారు మలబద్దకంతో బాధపడుతుంటారు.. కాబట్టి ఆహారంలో పీచు పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే మంచి నీరు ఎక్కువగా తాగాలి.
  • రోజు మనం వ్యాయమం లేదా వాకింగ్ చేసే సమయం కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోవాలి. అలా రోజుకు కనీసం ఒక గంట ప్రొద్దున, సాయంత్రం వాకింగ్, వ్యాయమం వంటివి తప్పనిసరిగా చేయాలి.
  • జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ కి బదులు చెరుకు రసం, కొబ్బరి బొండం, మజ్జిగా వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

ఇలా చేస్తే ఒక్కసారిగా కాకపోయిన నెమ్మది నెమ్మది బరువు తగ్గడం ఖాయం అంటున్నారు నిపుణులు

First Published:  13 March 2019 7:02 PM GMT
Next Story