Telugu Global
International

మీ వాట్సప్ నిలిపివేయడమైనది.... దయచేసి సెట్టింగ్స్ చెక్ చేయండి !

పొద్దున లేవగానే వాట్సప్ మెసేజ్ చూసుకోకుండా బ్రెష్ చేసే వాళ్లని లెక్కపెట్టండి…. చాలా తక్కువమంది తేలుతారు… సరే, అది వదిలేయండి.. కనీసం వాట్సప్‌లో ఒక మెసేజ్ అయినా చూసుకోని వాళ్లను వెతకండి.. కష్టమే కదా..? వాట్సప్ వ్యసనం…. కాదు.. కాదు… అంతకంటే ఎక్కువ. ఎందుకంటే… కాలేజీ, ఆఫీస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటూ ఎంతో మందిని కనెక్ట్ చేసే సోషల్ మీడియా యాప్ వాట్సప్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నా.. వాట్సప్‌కు ఉన్న […]

మీ వాట్సప్ నిలిపివేయడమైనది.... దయచేసి సెట్టింగ్స్ చెక్ చేయండి !
X

పొద్దున లేవగానే వాట్సప్ మెసేజ్ చూసుకోకుండా బ్రెష్ చేసే వాళ్లని లెక్కపెట్టండి…. చాలా తక్కువమంది తేలుతారు… సరే, అది వదిలేయండి.. కనీసం వాట్సప్‌లో ఒక మెసేజ్ అయినా చూసుకోని వాళ్లను వెతకండి.. కష్టమే కదా..?

వాట్సప్ వ్యసనం…. కాదు.. కాదు… అంతకంటే ఎక్కువ. ఎందుకంటే… కాలేజీ, ఆఫీస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటూ ఎంతో మందిని కనెక్ట్ చేసే సోషల్ మీడియా యాప్ వాట్సప్. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నా.. వాట్సప్‌కు ఉన్న క్రేజే వేరు.

అయితే చాలా మంది ఒకే ఫోన్ లో రెండు వాట్సప్ నెంబర్లు వాడటం కోసం గానీ.. మరిన్ని ఎక్స్‌ట్రా ఫీచర్లు వస్తున్నాయనో ‘థర్డ్ పార్టీ’ వాట్సప్ యాప్స్‌ను వాడుతున్నారు. వాట్సప్ ప్లస్, జీబీ వాట్సప్ వంటి యాప్స్ డౌన్‌లోడ్ చేసి వాట్సప్‌ను వాడుతున్నారు.

అయితే ఇలాంటి యాప్స్ వల్ల సమాచార భద్రత, ప్రైవసీకి తీవ్రమైన విఘాతం కలుగుతోంది. ఆ వాట్సప్ యాప్స్ వాడుతూ ఏమైనా సమస్యలు వచ్చినా వర్జినల్ వాట్సప్ యాజమాన్యానికి పిర్యాదులు చేస్తున్నారు. దీంతో వాట్సప్ కీలక నిర్ణయం తీసుకుంది.

థర్డ్ పార్టీ యాప్స్ వాడుతున్న వినియోగదారులకు వాట్సప్ సేవలను నిలిపివేస్తున్నట్లు వాట్సప్ ప్రకటించింది. ఇక ముందు అదే నెంబర్‌తో వాట్సప్ వాడుకోవాలంటే అధికారిక వాట్సప్ డౌన్ లోడ్ చేసుకోవాలని చెప్పింది. గత యాప్స్‌లో చేసిన చాటింగ్ బ్యాకప్ కూడా కొత్త దాంట్లోకి రాదని తేల్చి చెప్పింది.

ఇక…. మీది అసలైన వాట్సపో కాదో తెలుసుకోవాలంటే ఇలా చేయండి

  • ముందుగా మీ యాప్ ఓపెన్ చేయండి
  • తర్వాత ‘More Options’ కి వెళ్లండి
  • తర్వాత ‘Settings’ కి వెళ్లండి
  • తర్వాత HELP మీద క్లిక్ చేయండి
  • అప్పుడు మీరు ఏ వాట్సప్ వాడుతున్నారో తెలిసిపోతుంది.
First Published:  12 March 2019 11:39 PM GMT
Next Story