Telugu Global
Health & Life Style

మీ గుండె పదిలమేనా....

సాధారణంగా గుండే జబ్బులు 50 ఏళ్ళు పైబడిన వారికి వస్తాయి. కాని నేటి తరంలో చిన్నపిల్లలకు అంటే 30 ఏళ్ల లోపువారు కూడా గుండె జబ్బులతో చనిపోవటం మనం చూస్తున్నాం. యుక్త వయస్సులో వచ్చే గుండె సమస్యలకి కారణాలు, జాగ్రత్తాలు తెలుసుకుందాం.. యవ్వనంలో గుండె జబ్బులు రావడానికి కారణం మారిన జీవనశైలి అంటున్నారు నిపుణులు. ఆహారంలో మార్పులు అలాగే నిద్ర వేళ్లలో మార్పులు, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడమే ప్రధాన కారణాలు అని వారు అంటున్నారు. శరీరంలో […]

మీ గుండె పదిలమేనా....
X

సాధారణంగా గుండే జబ్బులు 50 ఏళ్ళు పైబడిన వారికి వస్తాయి. కాని నేటి తరంలో చిన్నపిల్లలకు అంటే 30 ఏళ్ల లోపువారు కూడా గుండె జబ్బులతో చనిపోవటం మనం చూస్తున్నాం. యుక్త వయస్సులో వచ్చే గుండె సమస్యలకి కారణాలు, జాగ్రత్తాలు తెలుసుకుందాం..

  • యవ్వనంలో గుండె జబ్బులు రావడానికి కారణం మారిన జీవనశైలి అంటున్నారు నిపుణులు. ఆహారంలో మార్పులు అలాగే నిద్ర వేళ్లలో మార్పులు, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడమే ప్రధాన కారణాలు అని వారు అంటున్నారు.
  • శరీరంలో అధిక శాతం కొవ్వు పేరుకుపోయి ఉంటే… గుండెకు కావాల్సినంత రక్తం సరఫరా కాకపోవడంతో గుండె బలహీనపడుతుంది.
  • జంక్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు నిపుణులు.
  • అధిక వత్తిడి కూడ కారణంగా చెబుతున్నారు. అధిక వత్తిడిని తగ్గించుకోవడానికి ధూమపానానికి అలవాటు పడుతున్నారు, ఇది కూడా గుండె సమస్యలకు దారి తీస్తుంది.

జాగ్రత్తలు

  • రోజు శరీరానికి వ్యాయమం తప్పనిసరి. మానసిక అలసట వలన నిద్రపట్టదు.. దీనికి మందు శరీరక అలసట. శరీరం అలసిపోతే నిద్ర వస్తుంది. దీని వలన వత్తిడిని నివారించ వచ్చు.
  • అధిక శాతం కొవ్వు ఉన్న పదార్దాల జోలికి పోకూడదు. అంతే కాదు రెడీమేడ్ ఫుడ్ కు నో చెప్పాలి.
  • గుండె జబ్బు ఉన్న వ్యక్తి డాక్టర్ సూచించిన మందులు ఎప్పుడూ కూడా వెంట ఉంచుకోవాలి.
  • కొంచెం దూరం నడిచినా, పరిగెత్తినా, మెట్లు దిగినా ఆయాసపడడం, మన సమ వయస్కులలాగా సమానంగా పనిచేయలేకపోవడం, హఠాత్తుగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పై లక్షణాలు కనిపిస్తే అశ్రద్ద చేయాక చిన్న, పెద్ద తేడా లేకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకుని వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
First Published:  12 March 2019 11:35 PM GMT
Next Story