Telugu Global
NEWS

అత్యంత రహస్య లేఖ మీ చేతికి ఎలా వచ్చింది? దాని పై కేసు వేస్తాం....

అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేయడంతోనే జగన్‌ పాదయాత్రకు వెళ్లారన్నారు వైసీపీ నేత సి.రామచంద్రయ్య. అసెంబ్లీలో జగన్ గొంతును నొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నించడం ఒక విధంగా వైసీపీకి మంచే జరిగిందన్నారు. ఇప్పుడు జగన్‌ గెలుపు ఖాయమైందన్నారు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే ఇప్పుడు మరో పథకం వేసి ఓట్లు తొలగించేందుకు కుట్ర చేశారన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి జగన్‌పై ఎల్లో మీడియా లేనిపోని కథనాలు రాయడం మొదలుపెట్టిందన్నారు. 2017లో సీబీఐకి ఈడీ లేఖ రాస్తే ఆ రహస్య లేఖ ఈ రెండు పత్రికలకు ఒకే రోజు […]

అత్యంత రహస్య లేఖ మీ చేతికి ఎలా వచ్చింది? దాని పై కేసు వేస్తాం....
X

అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేయడంతోనే జగన్‌ పాదయాత్రకు వెళ్లారన్నారు వైసీపీ నేత సి.రామచంద్రయ్య. అసెంబ్లీలో జగన్ గొంతును నొక్కేందుకు చంద్రబాబు ప్రయత్నించడం ఒక విధంగా వైసీపీకి మంచే జరిగిందన్నారు. ఇప్పుడు జగన్‌ గెలుపు ఖాయమైందన్నారు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు కాబట్టే ఇప్పుడు మరో పథకం వేసి ఓట్లు తొలగించేందుకు కుట్ర చేశారన్నారు.

ఎన్నికలు వచ్చాయి కాబట్టి జగన్‌పై ఎల్లో మీడియా లేనిపోని కథనాలు రాయడం మొదలుపెట్టిందన్నారు. 2017లో సీబీఐకి ఈడీ లేఖ రాస్తే ఆ రహస్య లేఖ ఈ రెండు పత్రికలకు ఒకే రోజు ఎలా వచ్చిందన్నారు. ఈ లేఖ చంద్రబాబు కనుసన్నల్లోనే అప్పుడు తయారైందన్నారు. ఈ లేఖ ఎలా వచ్చిందన్న దానిపై తాము కేసు వేస్తున్నట్టు చెప్పారు. ఈడీ లేఖ రాసినంత మాత్రాన సీబీఐ దానిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని రామచంద్రయ్య అన్నారు.

గత ఎన్నికల్లో సోనియా, కేసీఆర్, జగన్‌ ఒకటే అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్‌ పంచన చేరి… కేసీఆర్‌, జగన్‌, మోడీ ఒకటే అంటూ ప్రచారం చేస్తున్నారని రామచంద్రయ్య విమర్శించారు. చంద్రబాబు తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. మరోసారి చంద్రబాబు వస్తే ఇక మాట్లాడుకోవడం ఉండదన్నారు.

అవినీతిపై పోరాటం అని కథలు చెప్పిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇప్పుడు టీడీపీలోకి ఎలా చేరుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతి లక్ష్మీనారాయణకు కనిపించలేదా అన్నారు. జగన్‌ కేసుల విషయంలో జేడీ లక్ష్మీనారాయణ చంద్రబాబు చెప్పినట్లు చేసి చంద్రబాబుకు సహకరించినందుకే ఈ రోజు లక్ష్మీనారాయణకు చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నారని సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని రామచంద్రయ్య జోస్యం చెప్పారు.

First Published:  13 March 2019 1:11 AM GMT
Next Story