Telugu Global
NEWS

ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు దిగజారుస్తున్నారు

లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాల్సిందేనన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన ప్రజల డేటా ప్రైవేట్‌ వ్యక్తుల వద్దకు ఎలా చేరిందో తేలాల్సి ఉందన్నారు. వ్యక్తిగత డేటాను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్టుగా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయన్నారు. డేటా చోరి కేసులో నిందితుడిగా ఉన్న అశోక్ వెంటనే విచారణకు హాజరుకావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆధార్‌కు సంబంధించిన డేటా మొత్తం టీడీపీ ఆఫీస్‌లో నిక్షిప్తమై ఉందన్నారు. విజయవాడకు చెందిన ఒక వ్యక్తి టీడీపీ ఆఫీస్‌కు వెళ్తే పేరు, […]

ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు దిగజారుస్తున్నారు
X

లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేయాల్సిందేనన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌. ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన ప్రజల డేటా ప్రైవేట్‌ వ్యక్తుల వద్దకు ఎలా చేరిందో తేలాల్సి ఉందన్నారు. వ్యక్తిగత డేటాను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినట్టుగా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయన్నారు. డేటా చోరి కేసులో నిందితుడిగా ఉన్న అశోక్ వెంటనే విచారణకు
హాజరుకావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆధార్‌కు సంబంధించిన డేటా మొత్తం టీడీపీ ఆఫీస్‌లో నిక్షిప్తమై ఉందన్నారు.

విజయవాడకు చెందిన ఒక వ్యక్తి టీడీపీ ఆఫీస్‌కు వెళ్తే పేరు, మొబైల్ నెంబర్‌ చెప్పగానే… అతడి ఆధార్‌ కార్డులలోని ఫొటోతో ఐడీ కార్డును టీడీపీ ఆఫీస్‌ సిబ్బంది తీసి ఇచ్చారని ఉండవల్లి చెప్పారు.

ప్రతిపక్షాలు ఇంట్లో పిల్లలను ఎత్తుకెళ్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించడం సరైన పద్దతి కాదన్నారు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రక్రియను ఈ స్థాయిలో దిగదార్చడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా జూన్‌లో నీరు ఇవ్వడం అసంభవం అన్నారు ఉండవల్లి. అదే నిజమైతే చీఫ్ ఇంజనీర్‌తో ఆ మాట చెప్పించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.

పోలవరం దగ్గర జరుగుతున్న దారుణాలపై అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లే తనకు రోజూ ఫొటోలు తీసి పంపుతున్నారని చెప్పారు. కాపర్ డ్యాం కడుతూ నిజమైన డ్యాం అన్నట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

రంధ్రాన్వేషణ చేయడమే జర్నలిస్టుల పని అని…. కానీ ఈ దేశంలో పరిశోధన కథనాలు రాసిన జర్నలిస్టులపైనా కేసులు పెట్టే పరిస్థితి రావడం దురదృష్టమన్నారు. దేశంలో ఏం జరిగినా తాము సామాధానం చెప్పం, తాము నీతిమంతులం అని వాదించే ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మాత్రమేనన్నారు.

First Published:  12 March 2019 2:09 AM GMT
Next Story