Telugu Global
Cinema & Entertainment

రిలీజ్ కి రెడీ అయిన తమన్నా సినిమా

మిల్కీ బ్యూటీ తమన్నా, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా లీడ్ రోల్స్ లో నటించిన సినిమా “అభినేత్రి”. 2016 లో రిలీజ్ అయిన ఈ సినిమా పూర్తి స్థాయి హారర్ కామెడీ గా తెరకెక్కి ఓ మోస్తారు విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా వచ్చేస్తుంది. “అభినేత్రి” సినిమాని డైరెక్ట్ చేసిన ఏ.ఎల్ విజయ్ ఈ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. మొదటి భాగంలో నటించిన ప్రధాన తారాగణం ఈ సినిమాలోనూ లీడ్‌ రోల్స్‌ […]

రిలీజ్ కి రెడీ అయిన తమన్నా సినిమా
X

మిల్కీ బ్యూటీ తమన్నా, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా లీడ్ రోల్స్ లో నటించిన సినిమా “అభినేత్రి”. 2016 లో రిలీజ్ అయిన ఈ సినిమా పూర్తి స్థాయి హారర్ కామెడీ గా తెరకెక్కి ఓ మోస్తారు విజయాన్ని దక్కించుకుంది.

ఇక ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా వచ్చేస్తుంది. “అభినేత్రి” సినిమాని డైరెక్ట్ చేసిన ఏ.ఎల్ విజయ్ ఈ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. మొదటి భాగంలో నటించిన ప్రధాన తారాగణం ఈ సినిమాలోనూ లీడ్‌ రోల్స్‌ గా చేస్తున్నారు.

అయితే మొదటి భాగంలో తమన్నా ప్రెగ్నెంట్‌ అని తెలియడంతో సినిమా ఎండ్‌ చేస్తారు. ఇప్పుడు రెండో భాగంలో తమన్నా, ప్రభుదేవా జంటకు పుట్టబోయే బిడ్డ కి ఈ కథ ముడిపడి ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. మొదటి పార్ట్‌లో తమన్నాపై చిత్రీకరించిన ఓ సాంగ్‌లో మిల్కీబ్యూటీ డాన్సులు ఇరగదీసేసింది.

ఈ సీక్వెల్‌ కోసం కూడా తమన్నాపై అంతకు మించి అనిపించేలా ఓ సాంగ్‌ ఉండబోతోందని టాక్. ఇదిలా ఉంటే ఈ సీక్వెల్ సినిమా తెలుగు, తమిళ బాషల్లో ఏప్రిల్ 12 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

First Published:  11 March 2019 12:50 AM GMT
Next Story