Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమాకి రెమ్యునరేషన్ లేదట.... ప్రాఫిట్స్ లో షేర్ ఇస్తాడట...!

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. రాజ్ తరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకొని అన్నపూర్ణ స్టూడియోస్ లో నటించిన “రంగుల రాట్నం” బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఆ తరువాత దిల్ రాజు ప్రొడ్యూసర్ గా “లవర్” సినిమా చేసినా కూడా అది కూడా ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతానికి రాజ్ తరుణ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అందుకే రాజ్ తరుణ్ మళ్ళీ దిల్ రాజు తోనే […]

ఆ సినిమాకి రెమ్యునరేషన్ లేదట.... ప్రాఫిట్స్ లో షేర్ ఇస్తాడట...!
X

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. రాజ్ తరుణ్ ఎన్నో ఆశలు పెట్టుకొని అన్నపూర్ణ స్టూడియోస్ లో నటించిన “రంగుల రాట్నం” బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.

ఆ తరువాత దిల్ రాజు ప్రొడ్యూసర్ గా “లవర్” సినిమా చేసినా కూడా అది కూడా ఫ్లాప్ గా నిలిచింది. ప్రస్తుతానికి రాజ్ తరుణ్ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అందుకే రాజ్ తరుణ్ మళ్ళీ దిల్ రాజు తోనే సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు.

మొన్నీమధ్య రాజ్ తరుణ్ ఒక టర్కిష్ సినిమా చూసి దిల్ రాజుకి ఈ సినిమా రీమేక్ చేయమని కోరాడట. సినిమా నచ్చిన దిల్ రాజు రీమేక్ కి రెడీ అన్నాడు.

కానీ ఈ సినిమాలో రాజ్ తరుణ్ ఎటువంటి రెమ్యునరేషన్ లేకుండా నటించాలి అనేది దిల్ రాజు కండిషన్. ఎందుకంటే సినిమాకి వచ్చే ప్రాఫిట్స్ లో రాజ్ తరుణ్ కి షేర్ ఇవ్వాలి అనేది దిల్ రాజు ఆలోచన. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి డైరెక్టర్ ని వెతికే పనిలో రాజ్ తరుణ్ ఉన్నాడు.

First Published:  11 March 2019 2:22 AM GMT
Next Story