Telugu Global
Cinema & Entertainment

నరేష్ గెలిచాడు.... 'మా'లో మార్పు వస్తుందా?

శివాజీరాజాకు ముందు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా చాలామంది పనిచేశారు. అప్పుడు కూడా కొన్ని వివాదాలు వచ్చాయి. కానీ శివాజీరాజా టెర్మ్ లో వచ్చినన్ని విభేదాలు మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. శివాజీరాజా టర్మ్ లో అతడికి, నరేష్ కు మధ్య తలెత్తిన విభేదాలు ఏకంగా పెద్దమనుషుల పంచాయితీ వరకు వెళ్లింది. మొత్తానికి శివాజీరాజా ఓడిపోయాడు. అతడిపై వ్యతిరేకత కావొచ్చు, నరేష్ తెరవెనక చేసిన లాబీయింగ్ కావొచ్చు, కారణం ఏదైనా శివాజీరాజా ఓడిపోయాడు. మా అధ్యక్షుడిగా నరేష్ పగ్గాలు […]

నరేష్ గెలిచాడు.... మాలో మార్పు వస్తుందా?
X

శివాజీరాజాకు ముందు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా చాలామంది పనిచేశారు. అప్పుడు కూడా కొన్ని వివాదాలు వచ్చాయి. కానీ శివాజీరాజా టెర్మ్ లో వచ్చినన్ని విభేదాలు మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. శివాజీరాజా టర్మ్ లో అతడికి, నరేష్ కు మధ్య తలెత్తిన విభేదాలు ఏకంగా పెద్దమనుషుల పంచాయితీ వరకు వెళ్లింది.

మొత్తానికి శివాజీరాజా ఓడిపోయాడు. అతడిపై వ్యతిరేకత కావొచ్చు, నరేష్ తెరవెనక చేసిన లాబీయింగ్ కావొచ్చు, కారణం ఏదైనా శివాజీరాజా ఓడిపోయాడు. మా అధ్యక్షుడిగా నరేష్ పగ్గాలు చేపట్టాడు. ఇక్కడివరకు ఓకే. మరి అసోసియేషన్ పరిస్థితేంటి? నరేష్ రాకతో అసోసియేషన్ మారిపోతుందా? సమూల మార్పులు సంభవిస్తాయా?

అసోసియేషన్ లో అపరిష్కృతంగా చాలా సమస్యలున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆ సమస్యలు శివాజీరాజా అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు నుంచే ఉన్నాయి. శివాజీరాజా వచ్చిన తర్వాత కొన్ని కొలిక్కి వస్తే, మరికొన్ని కొత్త సమస్యలు వచ్చాయి. వాటన్నింటినీ పరిష్కరిస్తానంటున్నాడు నరేష్. కానీ ఇది అంత ఈజీ కాదు.

కొన్ని సమస్యల పరిష్కారానికి కోట్లలో నిధులు కావాలి. అంత డబ్బు “మా” వద్ద లేదు. పోనీ విరాళాలు సేకరిద్దామంటే, శివాజీరాజా చేసిన పనితో పాటు.. విదేశాల్లో ఇలాంటి చారిటీ షోలకు అనుమతులు దొరకడం కూడా కష్టంగా మారింది. ఇవన్నీ పక్కనపెడితే, తన చేతిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం కూడా నరేష్ కు తలకుమించిన భారం కావొచ్చు.

ఉన్న రెండేళ్ల పదవీకాలంలో నరేష్ ఎన్ని సమస్యల్ని ఓ కొలిక్కి తీసుకొస్తాడో చూడాలి. అతడు సమస్యల్ని పరిష్కరించకపోయినా పర్వాలేదు. కొత్త సమస్యలు తెచ్చిపెట్టకుండా ఉంటే, అదే పదివేలు అంటున్నారు శివాజీరాజా వర్గానికి చెందిన కొందరు.

First Published:  11 March 2019 5:52 AM GMT
Next Story