Telugu Global
Cinema & Entertainment

సీక్వెల్ చేయబోతున్న రాజశేఖర్

ఫస్ట్ టైమ్ తన కెరీర్ లో ఓ సీక్వెల్ చేయబోతున్నాడు రాజశేఖర్. తన కెరీర్ కు ఆక్సిజన్ అందించిన గరుడవేగ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ వివరాల్ని అఫీషియల్ గా ప్రకటిస్తానంటున్నాడు రాజశేఖర్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన రాజశేఖర్, ఆ ఆనందంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమా చేస్తున్నాడు రాజశేఖర్. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే గరుడవేగ పార్ట్-2 సెట్స్ పైకి […]

సీక్వెల్ చేయబోతున్న రాజశేఖర్
X

ఫస్ట్ టైమ్ తన కెరీర్ లో ఓ సీక్వెల్ చేయబోతున్నాడు రాజశేఖర్. తన కెరీర్ కు ఆక్సిజన్ అందించిన గరుడవేగ సినిమాకు సీక్వెల్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ మూవీ వివరాల్ని అఫీషియల్ గా ప్రకటిస్తానంటున్నాడు రాజశేఖర్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన రాజశేఖర్, ఆ ఆనందంలో ఈ విషయాన్ని బయటపెట్టాడు.

ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కల్కి అనే సినిమా చేస్తున్నాడు రాజశేఖర్. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే గరుడవేగ పార్ట్-2 సెట్స్ పైకి వస్తుందంటున్నాడు. ఆ మూవీకి నిర్మాతలు ఎవరనే విషయంతో పాటు, హీరోయిన్ వివరాల్ని కల్కి రిలీజ్ తర్వాత వెల్లడిస్తానంటున్నాడు యాంగ్రీ స్టార్.

నిజానికి గరుడవేగ హిట్ అయిన వెంటనే ప్రవీణ్ సత్తారును పిలిచి మరో సినిమా ఆఫర్ ఇచ్చాడు రాజశేఖర్. కానీ అప్పుడు వీళ్లిద్దరి కాంబో వర్కవుట్ కాలేదు. ఇప్పటివరకు మరో సినిమాకు కమిట్ అవ్వలేకపోయాడు ప్రవీణ్ సత్తారు. అందుకే మరోసారి రాజశేఖర్ తోనే గరుడవేగకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు.

First Published:  11 March 2019 5:32 AM GMT
Next Story