Telugu Global
Cinema & Entertainment

డైరెక్టర్ తో గొడవ పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ?

ఇండస్ట్రీ కి ఎక్కువ మంది కొత్త నటుల్ని పరిచయం చేసిన డైరెక్టర్ గా తేజకి పేరు ఉంది. అలాగే షూట్ లో తేజ చాలా సీరియస్ గా ఉంటాడని…. నటీనటుల దగ్గర నుంచి నటన రాబట్టడం కోసం తేజ వాళ్ళ పై చేయి చేసుకుంటాడు అనేది కూడా తెలిసిన విషయమే. ఈ ముక్కుసూటి తనం వల్లే తేజ లైఫ్ లో చాలా వెనకబడిపోయాడు అనే టాక్ కూడా ఉంది. అయితే ఇన్నేళ్ళు గడుస్తున్నా కూడా తేజ ఇంకా […]

డైరెక్టర్ తో గొడవ పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ?
X

ఇండస్ట్రీ కి ఎక్కువ మంది కొత్త నటుల్ని పరిచయం చేసిన డైరెక్టర్ గా తేజకి పేరు ఉంది. అలాగే షూట్ లో తేజ చాలా సీరియస్ గా ఉంటాడని…. నటీనటుల దగ్గర నుంచి నటన రాబట్టడం కోసం తేజ వాళ్ళ పై చేయి చేసుకుంటాడు అనేది కూడా తెలిసిన విషయమే.

ఈ ముక్కుసూటి తనం వల్లే తేజ లైఫ్ లో చాలా వెనకబడిపోయాడు అనే టాక్ కూడా ఉంది. అయితే ఇన్నేళ్ళు గడుస్తున్నా కూడా తేజ ఇంకా అలాగే ఉన్నాడని అంటున్నారు తేజతో పని చేసిన వారు.

ప్రస్తుతం తేజ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘సీత’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కొన్ని మనస్పర్ధలు తలెత్తడంతో తేజ షూటింగ్ నుండి వాకౌట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. ఈ గొడవ సర్దుమనిగితే గానీ షూటింగ్ కంటిన్యూ చేయలేమని చెబుతున్నారట మూవీ యూనిట్ సభ్యులు.

First Published:  11 March 2019 2:36 AM GMT
Next Story