Telugu Global
NEWS

వైసీపీలో చేరిన అలీ... ఎమన్నారంటే...

నటుడు అలీ వైసీపీలో చేరారు. లోటస్ పాండ్‌లో వైఎస్‌ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. మాట ఇస్తే కట్టుబడి ఉండే వ్యక్తి జగన్ అని అలీ చెప్పారు. అలాంటి నాయకుడి అవసరం ఉందన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. సాగర్‌ సొసైటీలో వైఎస్‌ఆర్ ఇంటికి పక్క వీధిలోనే తాము ఉండేవారిమన్నారు. గతంలో…. నెలలో రెండుమూడు సార్లు వైఎస్‌ను కలిసేవాడినన్నారు. వైసీపీలో చేరిన తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. ”పాదయాత్ర సమయంలో […]

వైసీపీలో చేరిన అలీ... ఎమన్నారంటే...
X

నటుడు అలీ వైసీపీలో చేరారు. లోటస్ పాండ్‌లో వైఎస్‌ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. వైసీపీ తరపున ప్రచారం చేస్తానని చెప్పారు. మాట ఇస్తే కట్టుబడి ఉండే వ్యక్తి జగన్ అని అలీ చెప్పారు. అలాంటి నాయకుడి అవసరం ఉందన్నారు.

వైఎస్ కుటుంబంతో తనకు ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉందన్నారు. సాగర్‌ సొసైటీలో వైఎస్‌ఆర్ ఇంటికి పక్క వీధిలోనే తాము ఉండేవారిమన్నారు.

గతంలో…. నెలలో రెండుమూడు సార్లు వైఎస్‌ను కలిసేవాడినన్నారు. వైసీపీలో చేరిన తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు.

”పాదయాత్ర సమయంలో చాలా మందికి టికెట్ కమిట్‌మెంట్ ఇచ్చాను… ఇప్పుడు వారిని పక్కన పెడితే ఫీల్ అవుతారు… నీవు వచ్చినట్టుగానే వాళ్లు పార్టీలోకి వచ్చారు. వారిని ఇప్పుడు పక్కన పెట్టలేను” అని జగన్‌ చెప్పారన్నారు అలీ.

ఒకవేళ పార్టీ టికెట్‌ ఇస్తే పోటీ చేస్తానన్నారు. తాను పోటీ చేయకపోయినా జగన్‌ను సీఎం చేయడం కోసం ప్రచారం చేస్తానన్నారు.

First Published:  11 March 2019 12:43 AM GMT
Next Story