Telugu Global
Cinema & Entertainment

మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అనుష్క

స్టార్ హీరోయిన్ అనుష్క “బాహుబలి” లాంటి సినిమా తరువాత “భాగమతి” వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఆ సినిమా తరువాత అనుష్క ఇప్పటి వరకు మళ్ళీ తన తదుపరి సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయలేదు. కానీ అనుష్క తన తదుపరి సినిమాని కోన వెంకట్ నిర్మాణంలో చేయనుంది. మాధవన్ హీరోగా నటించబోతున్న ఈ సినిమాని హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేయనున్నాడు. పూర్తి స్థాయి థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి “సైలెన్స్” […]

మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో అనుష్క
X

స్టార్ హీరోయిన్ అనుష్క “బాహుబలి” లాంటి సినిమా తరువాత “భాగమతి” వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించి హిట్ అందుకుంది. ఆ సినిమా తరువాత అనుష్క ఇప్పటి వరకు మళ్ళీ తన తదుపరి సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేయలేదు. కానీ అనుష్క తన తదుపరి సినిమాని కోన వెంకట్ నిర్మాణంలో చేయనుంది.

మాధవన్ హీరోగా నటించబోతున్న ఈ సినిమాని హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేయనున్నాడు. పూర్తి స్థాయి థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకి “సైలెన్స్” అని టైటిల్ ని ఖరారు చేసారు. త్వరలో ఫారిన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

ఈ సినిమా తరువాత అనుష్క సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సైన్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ కథ మొత్తం శబరిమల అయ్యప్ప స్వామి చుట్టూ తిరుగుతుందట. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ బాషల్లో ఈ సినిమాని రూపొందించనున్నారు మూవీ యూనిట్. ఈ సినిమాకి ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం అందించడానికి ముందుకి వచ్చాడని టాక్.

First Published:  11 March 2019 5:15 AM GMT
Next Story