Telugu Global
Cinema & Entertainment

శర్వానంద్ సినిమాకు భారీ రేటు

ఇంకా పేరు పెట్టని శర్వానంద్ సినిమాకు సంబంధించి మరో ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ వచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ దక్కించుకుంది. ఏకంగా మూడున్నర కోట్ల రూపాయల మొత్తానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ పై ఛానెళ్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. శర్వానంద్ తో పాటు సుధీర్ వర్మకు కూడా ఫ్లాపులు ఉండడంతో అంతా లైట్ […]

శర్వానంద్ సినిమాకు భారీ రేటు
X

ఇంకా పేరు పెట్టని శర్వానంద్ సినిమాకు సంబంధించి మరో ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ వచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను జెమినీ టీవీ దక్కించుకుంది. ఏకంగా మూడున్నర కోట్ల రూపాయల మొత్తానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.

మొన్నటివరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ పై ఛానెళ్లు పెద్దగా ఆసక్తి చూపించలేదు. శర్వానంద్ తో పాటు సుధీర్ వర్మకు కూడా ఫ్లాపులు ఉండడంతో అంతా లైట్ తీసుకున్నారు. ఒక దశలో జెర్సీ సినిమా కొన్న ఛానెల్ కే, 1+1 ఆఫర్ కింద శర్వా సినిమా రైట్స్ కూడా ఇచ్చేయాలని భావించింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. కానీ ఆశ్చర్యకరంగా జెమినీ టీవీ రంగంలోకి దిగింది. కాస్త ఎక్కువ మొత్తానికే ఈ సినిమా రైట్స్ దక్కించుకుంది. ఊహించని విధంగా డీల్ ఓకే అవ్వడంతో సితార నిర్మాతలు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.

రెండు డిఫరెంట్ షేడ్స్ లో శర్వానంద్ కనిపిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. మొన్న జరిగిన శర్వా పుట్టినరోజు నాడు కూడా టైటిల్ లేకుండానే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దాదాపు 2 నెలలుగా టైటిల్ కోసం గాలిస్తున్న యూనిట్.. మరో 10 రోజుల్లో ఏదో ఒక టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ ఉంది.

First Published:  9 March 2019 10:58 PM GMT
Next Story