Telugu Global
Cinema & Entertainment

క్లారిటీ ఇవ్వడానికి రాజమౌళి రెడీ

ఆర్-ఆర్-ఆర్ సినిమా అసలు టైటిల్ ఏంటి ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు? అసలు ఆర్-ఆర్-ఆర్ సినిమా స్టోరీ ఏంటి?…. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అనుమానాలు. మరెన్నో ఊహాగానాలు. కానీ వీటిపై ఒక్కటంటే ఒక్కసారి కూడా స్పందించలేదు దర్శకుడు రాజమౌళి. తను మీడియాను దూరం పెట్టడమే కాకుండా.. హీరోల్ని కూడా మాట్లాడొద్దని ఆదేశాలిచ్చాడు. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేక ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమాపై […]

క్లారిటీ ఇవ్వడానికి రాజమౌళి రెడీ
X
  • ఆర్-ఆర్-ఆర్ సినిమా అసలు టైటిల్ ఏంటి
  • ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు?
  • అసలు ఆర్-ఆర్-ఆర్ సినిమా స్టోరీ ఏంటి?….

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై ఎన్నో అనుమానాలు. మరెన్నో ఊహాగానాలు. కానీ వీటిపై ఒక్కటంటే ఒక్కసారి కూడా స్పందించలేదు దర్శకుడు రాజమౌళి. తను మీడియాను దూరం పెట్టడమే కాకుండా.. హీరోల్ని కూడా మాట్లాడొద్దని ఆదేశాలిచ్చాడు. దీంతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేక ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు.

ఎట్టకేలకు ఈ సినిమాపై స్పందించడానికి రాజమౌళి రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ కంప్లీట్ అయిన వెంటనే ఓ ప్రెస్ మీట్ నిర్వహించాలని భావిస్తున్నాడట జక్కన్న. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ షెడ్యూల్ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి.

ఈ ప్రెస్ మీట్ పూర్తయిన వెంటనే మరో భారీ షెడ్యూల్ కోసం యూనిట్ అంతా కలిసి కోల్ కతా వెళ్తుంది. అక్కడ 40 రోజుల పాటు షూటింగ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ పూర్తి మేకోవర్స్ తో కనిపించబోతున్నారట. ఎన్టీఆర్ అయితే అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కూడా కనిపిస్తాడట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

First Published:  10 March 2019 3:21 AM GMT
Next Story