Telugu Global
NEWS

సీ ఓటర్ సర్వేలో నిజమెంత?

ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు పలు సర్వేలు ప్రకటించాయి. ప్రతి సర్వే కూడా వైసీపీ తిరుగులేని విజయం సాధించబోతోంది అని చెప్పాయి. అయితే సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన గంటకే సీ-ఓటర్ సర్వే పేరుతో కొన్ని టీవీ చానళ్లు హడావుడి మొదలుపెట్టాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉండబోతోందని సీ ఓటర్స్ చెబుతోంది. టీడీపీకి 14 లోక్‌సభ స్థానాలు, వైసీపీకి 11 లోక్‌సభ స్థానాలు వస్తాయని సీ ఓటర్స్ సర్వే చెప్పింది. రెండు పార్టీల మధ్య ఓటింగ్ శాతం […]

సీ ఓటర్ సర్వేలో నిజమెంత?
X

ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు పలు సర్వేలు ప్రకటించాయి. ప్రతి సర్వే కూడా వైసీపీ తిరుగులేని విజయం సాధించబోతోంది అని చెప్పాయి. అయితే సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన గంటకే సీ-ఓటర్ సర్వే పేరుతో కొన్ని టీవీ చానళ్లు హడావుడి మొదలుపెట్టాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉండబోతోందని సీ ఓటర్స్ చెబుతోంది.

టీడీపీకి 14 లోక్‌సభ స్థానాలు, వైసీపీకి 11 లోక్‌సభ స్థానాలు వస్తాయని సీ ఓటర్స్ సర్వే చెప్పింది. రెండు పార్టీల మధ్య ఓటింగ్ శాతం కూడా కేవలం రెండు శాతం తేడా ఉంది.

అయితే ఈ సీ- ఓటర్స్ సర్వే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ పలుమార్లు సర్వేలు ప్రకటించింది. టీడీపీ- కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించబోతోందని తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రకటించింది.

నవంబర్ 9న ఇదే సీ ఓటర్స్‌ సంస్థ… తెలంగాణలో మహాకూటమి 64 స్థానాలతో అధికారంలోకి వస్తోందని చెప్పింది. టీఆర్‌ఎస్‌ కేవలం 42 స్థానాలకు పరిమితం అవుందని చెప్పింది. కానీ సీ- ఓటర్ సర్వే తెలంగాణలో బొక్కబోర్లా పడింది.

కానీ అసలు ఫలితంలో టీఆర్‌ఎస్ ఏకంగా 88 స్థానాల్లో గెలిచింది. 64 స్థానాలను మహాకూటమి సొంతం చేసుకుంటుందని సీ ఓటర్స్ సంస్థ చెప్పగా… మహకూటమి కేవలం 23 స్థానాలతో కుదేలైంది. కేవలం ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు ఇలాంటి ఎత్తులు మరిన్ని వేస్తారని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని వైసీపీ సూచిస్తోంది.

First Published:  10 March 2019 10:30 AM GMT
Next Story