Telugu Global
NEWS

చంద్రబాబుపై అయ్యన్న ఆగ్రహం

విశాఖ టీడీపీలో అసమ్మతి రాజుకుంది. మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఎంపీ టికెట్‌ ఈసారి కూడా కొత్తవారికి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమవడంపై అయ్యన్నపాత్రుడు నిరసన తెలిపారు. కొత్తగా వచ్చే వారికి సీట్లు కట్టబెడితే… పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని చంద్రబాబును అయ్యన్న ప్రశ్నించారు. పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా పార్టీలోకి వస్తున్న వారు పదవులు అనుభవించి వెళ్లిపోతే అప్పుడు పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అయినా సీఎం తగ్గక […]

చంద్రబాబుపై అయ్యన్న ఆగ్రహం
X

విశాఖ టీడీపీలో అసమ్మతి రాజుకుంది. మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం సమావేశం నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. ఎంపీ టికెట్‌ ఈసారి కూడా కొత్తవారికి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమవడంపై అయ్యన్నపాత్రుడు నిరసన తెలిపారు.

కొత్తగా వచ్చే వారికి సీట్లు కట్టబెడితే… పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటని చంద్రబాబును అయ్యన్న ప్రశ్నించారు. పార్టీని నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా పార్టీలోకి వస్తున్న వారు పదవులు అనుభవించి వెళ్లిపోతే అప్పుడు పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న తమలాంటి వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

అయినా సీఎం తగ్గక పోవడంతో అయ్యన్నపాత్రుడు సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు. సీఎంవో అధికారులు ఫోన్ చేసినా అయ్యన్న స్పందించలేదు. గత ఎన్నికల్లోనూ సీటు త్యాగం చేశానని… పదేపదే అదే పనిచేయమంటే ఎలా అని అయ్యన్న ప్రశ్నిస్తున్నారు.

First Published:  10 March 2019 3:14 AM GMT
Next Story