Telugu Global
NEWS

డబ్బులిచ్చి ఓట్లు కొనడం ఈ దేశానికి నేర్పిందే నువ్వు....

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు డబ్బు పంపించారని స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థులే చెప్పారన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. ఎన్నికల్లో డబ్బులు పంచడం ఈ దేశానికి నేర్పిందే చంద్రబాబు అన్నారు. నేను కూడా చాలా ఏళ్ళు తెలుగుదేశంలో నాయకుడిగా ఉన్నాను. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎంతకు దిగజారుతాడో…. డబ్బులు, మందు ఎలా పంచిపెడతాడో! తనకు బాగా తెలుసన్నాడు. తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అంటూ చంద్రబాబు మాట్లాడుతాడని…. కానీ అది ఒక్కప్పుడు…. ఎన్టీఆర్ హయాంలో… కానీ ఇప్పుడు […]

డబ్బులిచ్చి ఓట్లు కొనడం ఈ దేశానికి నేర్పిందే నువ్వు....
X

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు డబ్బు పంపించారని స్వయంగా కాంగ్రెస్ అభ్యర్థులే చెప్పారన్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. ఎన్నికల్లో డబ్బులు పంచడం ఈ దేశానికి నేర్పిందే చంద్రబాబు అన్నారు. నేను కూడా చాలా ఏళ్ళు తెలుగుదేశంలో నాయకుడిగా ఉన్నాను. ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఎంతకు దిగజారుతాడో…. డబ్బులు, మందు ఎలా పంచిపెడతాడో! తనకు బాగా తెలుసన్నాడు.

తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అంటూ చంద్రబాబు మాట్లాడుతాడని…. కానీ అది ఒక్కప్పుడు…. ఎన్టీఆర్ హయాంలో… కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ వర్గానిదో అందరికీ తెలుసు అన్నారు. నారావారిపల్లెలో తనకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారని… చంద్రబాబు అమ్మగారు ఏనాడూ హైదరాబాద్‌కు వచ్చింది లేదని వారు చెబుతారన్నారు.

కానీ హైదరాబాద్‌లో కోట్లు పెట్టి చంద్రబాబు తల్లి ఆస్తులు కొని వాటిని మనవడికి గిఫ్ట్‌గా ఇచ్చినట్టు చంద్రబాబు నమ్మిస్తున్నాడని తలసాని విమర్శించారు. సమాజంలో పేదలు, ధనికుల మధ్య ఇంత అంతరమా? అని చంద్రబాబు మాట్లాడతాడని…. వాళ్ళ కుటుంబంలో నలుగురుంటే వాళ్ళకు అన్ని వందల కోట్ల ఆస్తులు పెట్టుకుని…. ఆయన మాత్రమే అలా మాట్లాడగలడని…. నిన్నగాక మన్న పుట్టిన దేవామ్ష్ పేరుమీద 80 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని…. తలసాని ప్రశ్నించారు.

ప్రజల డేటా దొంగతనం చేసిన చంద్రబాబు, లోకేష్‌… ఇప్పుడు దాని నుంచి తప్పించుకునేందుకు ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటూ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కుళ్లు రాజకీయాలు చేయడం చంద్రబాబుకే అలవాటన్నారు. చంద్రబాబు శరీరమే కుళ్లు శరీరం అన్నారు.

మీడియా కూడా చంద్రబాబుకు వంత పాడుతోందని చంద్రబాబు మాట్లాడుతుంటే టీవీలో ఆయనను చూపిస్తూ…. మిగిలిన సగ భాగంలో విజయసాయి రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదును చాలా సేపు చూపారని…. ఉదయం నుంచి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి ఏవో రహస్య పత్రాలను మీడియా ముందు ఉంచుతాడు అన్నట్టు బ్రేకింగ్ లు ఇచ్చారని…. తీరా చంద్రబాబు మాత్రం విజయసాయి రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఫిర్యాదును మీడియా ముందు పెట్టాడని…. ఇందులో పెద్ద జోక్ ఏమిటంటే…. విజయసాయి రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన ఆ ఫిర్యాదు కాపీలను ఆరోజే విలేకరులకు కూడా ఇచ్చాడని…. ఇప్పుడు ఆ కాగితం తీసుకొచ్చి ఏదో పెద్ద రహస్యం కనిపెట్టినట్టు ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటని ప్రశ్నించాడు.

టీడీపీ యాప్‌లో ఉన్నది కార్యకర్తల సమాచారం కాదని… మూడున్నర కోట్ల మంది ప్రజల వివరాలున్నాయన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు వందల కోట్లు ఖర్చు పెట్టడం లేదని కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని సవాల్ చేశారు తలసాని. ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ చంద్రబాబు చెబుతున్నారని… ఆయన పై ఏ విమర్శ చేసినా ఆంధ్రులను అవమానిస్తారా? అంటున్నారని…. మరి జగన్‌, పవన్‌ కల్యాణ్ ఏమైనా పాకిస్థాన్‌ తరపున మాట్లాడుతున్నారా? అని తలసాని ప్రశ్నించారు.

ఎవరో అడ్డుకుంటే అభివృద్ధి చేయలేకపోయాను అంటే అది చేతగాని తనమే అవుతుందన్నారు. తన గురించి తెలుసుకోవాలంటే మహానాయకుడు సినిమా చూడాలని చంద్రబాబు ఆంటున్నారని… ఆ సినిమా దెబ్బకే బాలకృష్ణ ఇంట్లో పడుకున్నారని తలసాని ఎద్దేవా చేశారు. 18 కేసుల్లో 20 ఏళ్లుగా స్టేలు తెచ్చుకుని తిరుగుతున్న వ్యక్తి దేశంలో చంద్రబాబు మాత్రమేనన్నారు.

First Published:  9 March 2019 8:15 AM GMT
Next Story