Telugu Global
Health & Life Style

మండేకాలంలో చల్లగా ఉందాం!

ఎక్కువగా అలసట కలిగించే కాలం వేసవికాలం. అధిక ఊష్ణోగ్రత వల్ల డీ హైడ్రేషన్, దద్దుర్లు, వడదెబ్బ వంటివి తలెత్తడం అతిసాధారణం. వీటన్నింటిని  కూడా మనం నివారించవచ్చు. కానీ తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఔట్ డోర్ లో తిరిగే ప్రతీ ఒక్కరూ ఈ జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది. అధిక మోతాదులో మంచినీళ్లు తాగాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. వేసవికాలంలో మందమైన దుస్తులు కాకుండా పలచటి దుస్తులు ధరించాలి అంటున్నారు వైద్యులు. ఇక్కడ కొన్ని ఆరోగ్య […]

మండేకాలంలో చల్లగా ఉందాం!
X

ఎక్కువగా అలసట కలిగించే కాలం వేసవికాలం. అధిక ఊష్ణోగ్రత వల్ల డీ హైడ్రేషన్, దద్దుర్లు, వడదెబ్బ వంటివి తలెత్తడం అతిసాధారణం. వీటన్నింటిని కూడా మనం నివారించవచ్చు. కానీ తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఔట్ డోర్ లో తిరిగే ప్రతీ ఒక్కరూ ఈ జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది. అధిక మోతాదులో మంచినీళ్లు తాగాలి. ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. వేసవికాలంలో మందమైన దుస్తులు కాకుండా పలచటి దుస్తులు ధరించాలి అంటున్నారు వైద్యులు.

ఇక్కడ కొన్ని ఆరోగ్య సమస్యలు ఎండాకాలంలోనే చూస్తున్నాం. కొన్ని ఉపయోగకరమైన టిప్స్ చదివితే అవగాహన పెంపొందించుకోవచ్చు.

హీట్ స్ట్రోక్

హీట్ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదకరమైంది. మన శరీరం మోతాదుకు మించి వేడిని స్వీకరించడం వల్ల ఇలాంటి పరిస్థితి దాపురిస్తుంది. ఎక్కువగా ఎండాకాలంలోనే ఈ సమస్యను ఎదుర్కొంటారు. శరీర ఊష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల హీట్ స్ట్రోక్ వాటిల్లుతుంది.

40 డిగ్రీలు మించినప్పుడు ఈ సమస్య ఎదురౌతుంది. వాంతులు, వికారం, తలనొప్పి అనేవి హీట్ స్ట్రోక్ ముఖ్య లక్షణాలు అని చెప్పొచ్చు. ఇటువంటి వారిని చల్లని ప్రాంతానికి తీసుకెళ్లాలి. టబ్ లో చల్లటినీటిలో పడుకోబెట్టాలి. ఊష్ణోగ్రత తగ్గడం వల్ల హీట్ స్ట్రోక్ ను నివారించగలుగుతాం. పలచటి దుస్తులు ధరించాలి. అవి కూడా వదులుగా ఉండాలి. గాలి అటు ఇటూ ఆడేందుకు ఉండాలి. పానీయాలు ఎక్కువగా త్రాగాలి. అంటే కొబ్బరిబొండం, పండ్ల రసాలు, నిమ్మరసం తీసుకోవాలి. శీతలపానీయాల జోలికి అస్సలు వెళ్లకూడదు. సాధారణ ఊష్ణోగ్రత వచ్చే వరకు ఈ పానీయాలు స్వీకరిస్తుండాలి. విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి.

డీ హైడ్రేషన్

డీహైడ్రేషన్ రావడానికి ప్రధాన కారణాల్లో మన శరీరంలో నీటి సమతుల్యత దెబ్బతినడం. కాబట్టి ద్రవాలను ఎక్కువ మోతాదులో స్వీకరించాలి. డీ హైడ్రేషన్ వల్ల మన శరీరం నుంచి నీరు విసర్జింపబడుతుంది. చెమటరూపంలో లేదా మూత్రం రూపంలో నీరు బయటికెళ్లిపోతుంది. డీ హైడ్రేషన్ లక్షణాలను గుర్తుపట్టడం చాలా తేలిక. బాగా దాహం వేస్తుంది. డీ హైడ్రేషన్ వచ్చిందంటే భరించడం కష్టం. డీ హైడ్రేషన్ వల్ల తలనొప్పి ఎక్కువగా వస్తుంది. వాంతులు తీవ్రమౌతాయి. బాగా అలసిపోతారు. డీ హైడ్రేషన్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఎక్కువ మోతాదులో నీరు త్రాగాలి. అలాగే ద్రవాలు తీసుకోవాలి. ప్రతి రోజూ రెండు లీటర్ల నీటిని తీసుకోవడం తప్పనిసరి. ఫ్లూయిడ్ అంటే ఉల్లిగడ్డ జ్యూస్, బట్టర్ మిల్క్ , కొబ్బరి బొండం తీసుకోవడం వల్ల డీ హైడ్రేషన్ ని అధిగమించొచ్చు. జ్వరం, వణకడం, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

సన్ బర్న్

సన్ బర్న్ అనేది ఎరుపు వర్ణంలో ఉంటుంది. చర్మం మీద వాచిపోయిన మచ్చలు కనిపిస్తాయి. అల్ట్రా వయొలెట్ కిరణాలు మన చర్మాన్ని తాకినప్పుడు సన్ బర్న్ ప్రారంభమౌతుంది. పాక్షికం లేదా తీవ్రంగా సన్ బర్న్ వాటిల్లవచ్చు. మనం ఎంత సేపు ఎండలో తిరిగామో దానిని బట్టి సన్ బర్న్ ఉంటుంది. సన్ బర్న్ ను తేలికగా తీసుకోకూడదు.

ఎందుకంటే స్కిన్ క్యాన్సర్ కి దారితీయవచ్చు. సన్ బర్న్ వల్ల తీవ్రంగా ఎరుపు వర్ణంలోకి మారిపోతారు. చర్మం కూడా వాచిపోతుంది. నొప్పి ప్రారంభమౌతుంది. జ్వరం, వణకడం, వాంతులు, వికారం వంటి లక్షణాలు సన్ బర్న్ ఉన్నవారికి కనిపించడం మామూలే.

సన్ బర్న్ ను నివారించడానికి సన్ స్క్రీన్స్ రాసుకోవాలి. సన్ బ్లాక్స్ అందుబాటులో ఉంటాయి. చర్మానికి హానికరమైన యువి కిరణాలకు దూరంగా ఉండాలి. ఈ యువి కిరణాలు సూర్యుడి కిరణాల్లో దాగి ఉంటాయి. సన్ స్క్రీన్లను ఎండలో వెళ్లడానికి అరగంట ముందే రాసుకోవాలి. ఇలా చెయ్యడం వల్ల సన్ బర్న్ దూరం చేయొచ్చు.

వేడి దద్దుర్లు

వేడి దద్దుర్లు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దురద, నొప్పి వంటివి సంభవిస్తాయి. శరీరం మీద దద్దుర్లు కనిపిస్తాయి. బాగా చెమటలు పడతాయి. స్వేదగ్రంథులు బ్లాక్ అయిపోతాయి. అంటే అవి పనిచేయవు. పిల్లల్లో వేడిదద్దుర్లు ఎక్కువగా కనిపిస్తాయి.

ఎవరికైతే చెమట ఎక్కువగా పడుతుందో వాళ్లు వేడి దద్దుర్లు ఎదుర్కోక తప్పదు. పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్యను అధిగమించడం సులభతరమే. మన శరీరం అవసరానికి మించి వేడిని స్వీకరిస్తే ఈ సమస్య వాటిల్లుతుంది. ఇటువంటి వారు టాల్కమ్ పౌడర్ వేసుకోవాలి. చర్మం పొడిపొడిగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. వదులైన దుస్తులు ధరించాలి.

పాదాల ఇన్ ఫెక్షన్

పాదాల ఇన్ఫెక్షన్ అనేది వేసవికాలంలో అతిసాధారణమైంది. వేసవికాలంలో చెమట బాగా పడుతుంది. ఈ చెమట వల్ల బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. పాదాల్లో బ్యాక్టీరియా చేరడం, ముఖ్యంగా కాళ్లవేళ్ల గోర్లు దెబ్బతింటాయి. డయాబెటిక్‌ పేషెంట్స్‌ ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

First Published:  8 March 2019 9:00 PM GMT
Next Story